తోటి డాన్సర్ పై లైంగిక వేధింపుల కేసులో పోక్సో యాక్ట్ నమోదు కావడంతో రెండు వారాల నుంచి జైలు లో ఉన్న జానీ మాస్టర్ ఇటీవల బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు దేశం ధాటి వెళ్లకూడదని కూడా చెప్పింది.
ఇక జానీ మాస్టర్(jani master)తన సొంత ఊరు నెల్లూరుకి హైదరాబాద్ నుంచి కారులో బయలు దేరాడు.పిడుగురాళ్ల దగ్గరలోని బ్రాహ్మణపల్లి దగ్గర ఒక వ్యక్తి యాక్సిడెంట్ కి గురవ్వడం జరిగింది. గమనించిన జానీ మాస్టర్ వెంటనే కారు అపి 108 కి ఫోన్ చేసి అంబులెన్సు తెప్పించాడు. ఆ తర్వాత క్షతగాత్రుడిని తనే దగ్గరుండి అంబులెన్స్ లోకి ఎక్కించాడు.ఇప్పుడు ఆ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.