హీరోయిన్లకి గుర్తింపు తగ్గుతుంది. ఈ మాటని అందరు నమ్ముతున్న టైంలో కొంత మంది హీరోయిన్ లు వస్తారు. మీరు చెప్పేదంతా అబద్దం అని నిరూపిస్తారు . అలాంటి హీరోయిన్లలో ఒకరు శ్రీలీల. తన అందంతో, నటనతో, హీరోలతో పోటీ పడే డాన్సులతో తక్కువ వ్యవధిలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది. అసలు కొన్ని నెలల క్రితం వరకు ఏ హీరో సినిమా చూసినా తనే హీరోయిన్. హీరోల అప్ కమింగ్ ప్రాజెక్టు ల్లో కూడా తన పేరే వినపడేది. ఇక గత కొన్ని రోజుల నుంచి శ్రీ లీల కెరీర్ లో స్పీడ్ తగ్గిందేమోనని అభిమానుల్లో అనుమానం మొదలయ్యింది. ఈ క్రమంలో లేటెస్ట్ న్యూస్ ఒకటి వాళ్ళల్లో సంతోషాన్ని తెచ్చింది
శ్రీలీల ఒక తమిళ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైగా హీరో అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు. తమిళ అగ్ర హీరో అజిత్. ఆయన అప్ కమింగ్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ .ఈ మూవీలోనే శ్రీ లీల, అజిత్ కి జతగా నటించబోతుంది. విశాల్ తో ఇటీవల మార్క్ ఆంథోనీ ని తెరకెక్కించిన అధిక్ రవి చంద్రన్ దర్శకుడు. తన కెరీర్లోనే అజిత్ తొలిసారి త్విపాత్రాభినయం చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుంది.
కొన్నాళ్ల క్రితం తెలుగులో ఏ హీరో సినిమా చూసినా శ్రీ లీలే ఉండేది. వాటిల్లో కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడంతో చాలా విమర్శలు వచ్చాయి. ఇలాంటి టైం లో అజిత్ మూవీ ఆమెకి బంపర్ ఆఫర్ లాంటింది. తమిళంలో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది .మరి తమిళ ప్రేక్షకులకి ఊర మాస్ డాన్స్ అంటే ప్రాణం. శ్రీ లీల ఏమో అందులో క్వీన్. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రేక్షకులని శ్రీలీల డాన్సులు ఒక ఊపు ఊపడం ఖాయం. చివరిగా మహేష్ బాబు గుంటూరు కారం లో చేసింది. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లోను చేస్తుంది.