![]() |
![]() |

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ అన్ని భాషల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. 'మహానటి', 'సీతారామం' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. తాజాగా మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేయనున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఆదివారం నాడు మేకర్స్ అధికారికంగా ఈ ప్రాజెక్ట్ కి ప్రకటించారు. ఈ ఏడాది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మించిన 'సార్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ అట్లూరి.. వరుసగా ఆ బ్యానర్స్ లోనే సినిమాలు చేస్తుండటం విశేషం. తమిళ హీరో ధనుష్ నటించిన 'సార్'తో మంచి హిట్ కొట్టిన వెంకీ.. మలయాళ హీరో దుల్కర్ తోనూ ఆ హిట్ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ 2023, అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. 2024 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |