![]() |
![]() |

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'హనుమాన్'. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ చిత్రాలను మించేలా విజువల్స్ ఉన్నాయనే ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుండగా.. తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
'హనుమాన్' సినిమాని మే 12న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. ఎటువంటి హడావుడి లేకపోవడంతో ఈ సినిమా వాయిదా పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఊహించినట్లుగానే ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు తాజాగా మూవీ టీం ప్రకటించింది. టీజర్ కి లభించిన స్పందనతో తమపై బాధ్యత ఇంకా పెరిగిందని, బెస్ట్ అవుట్ పుట్ తో అద్భుతమైన అనుభూతిని కల్గించాలన్న ఉద్దేశంతో మరింత సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో అమృత అయ్యర్ , వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శివేంద్ర సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |