![]() |
![]() |

డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. ఇంతదాకా ఆయన కెరీర్‌లో రవితేజ హీరోగా చేసిన 'కిక్ 2' మూవీ అతిపెద్ద డిజాస్టర్‌గా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును అఖిల్ హీరోగా రూపొందించిన 'ఏజెంట్'తో అధిగమించాడు సురేందర్ రెడ్డి. 'ఏజెంట్'ను చూసి చాలామంది ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు.. ఇది సురేందర్ రెడ్డి తీసిన సినిమాయేనా! అని. ప్రధాన పాత్రల్ని ఆయన చూపించిన విధానం, బలహీనమైన కథనం 'ఏజెంట్' మూవీని డిజాస్టర్‌గా నిలబెట్టాయి. వక్కంతం వంశీ ఇచ్చిన కథ కూడా అదేరకంగా ఉందనుకోండి.
సినిమా విజయంలో ప్రధాన పాత్ర వహించేది దర్శకుడు దాన్ని తీర్చిదిద్దిన విధానం వల్లే. అందుకేగా డైరెక్టర్‌ను కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది. సినిమా బాగుంటే, స్టార్ పవర్ దానికి మరింత కలెక్షన్లు తెచ్చిపెడుతుంది. అందువల్ల 'ఏజెంట్' బాక్సాఫీస్ ఫలితం అనేది సురేందర్ రెడ్డి ఖాతాలోనే వెళ్తుంది.
2005లో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అతనొక్కడే' సినిమాతో దర్శకుడిగా పరిచయమై అందరి దృష్టినీ ఆకర్షించాడు సురేందర్. బిగినింగ్‌లోనే హీరోయిన్ ఒక దుండగుడ్ని కత్తితో పొడిచి చంపడం ఒక షాకింగ్ సీన్. తొలి సినిమాతోటే తనేమిటో రుచి చూపించిన ఆయన.. ఆ తర్వాత తన స్టైలిష్ మేకింగ్‌తో కిక్, రేసుగుర్రం, ధ్రువ లాంటి హిట్ మూవీస్‌ని తీశాడు. చిరంజీవితో తీసిన మునుపటి సినిమా 'సైరా.. నరసింహారెడ్డి' కూడా ఆయనకు మంచి పేరే తెచ్చింది.
అయితే జూనియర్ ఎన్టీఆర్‌తో రెండు సినిమాలు.. 'అశోక్', 'ఊసరవెల్లి' తీసినా హిట్టివ్వలేకపోయాడు సురేందర్. అలాగే మహేశ్‌ను 'అతిథి'గా చూపించి ఫెయిలయ్యాడు. వీటన్నింటికంటే 'కిక్ 2' సినిమా ఆయనకు బాగా చెడ్డపేరు తెచ్చింది. బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు 'ఏజెంట్' వచ్చాక 'కిక్ 2'యే బెటర్ అని చెప్పుకుంటున్నారు జనం. ఈ మూవీతోనైనా కెరీర్‌లో ఒక్క మాస్ బ్లాక్‌బస్టర్ కొడతానని ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎంతో కష్టపడి ఎయిట్ ప్యాక్ చేసిన అఖిల్ దారుణంగా దెబ్బతిన్నాడు. అఖిల్ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన 'అఖిల్'ను మించిన డిజాస్టర్‌గా 'ఏజెంట్' నిలిచింది. ఇలా అటు అఖిల్‌కు, ఇటు తనకు కెరీర్‌కు బిగ్గెస్ట్ డిజాస్టర్‌ని ఇచ్చి వార్తల్లో వ్యక్తిగా మారాడు సురేందర్ రెడ్డి.
![]() |
![]() |