![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ లో తన చేతిలో ఉన్న సినిమాల షూటింగ్ లు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే 'వినోదయ సిత్తం' రీమేక్ లో తన భాగం షూటింగ్ పూర్తి చేశారు. అలాగే ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్' మొదటి షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 'ఓజీ' మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఓజీ'. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో 'ఉస్తాద్' మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న పవన్.. ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న 'ఓజీ' సెట్స్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తయిందని తాజాగా మేకర్స్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసిన మేకర్స్.. పవన్ ఫోటోను విడుదల చేశారు. బ్లూ టీషర్ట్, నల్ల కళ్ళద్దాలతో పవన్ లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

'ఓజీ' మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన పవన్.. త్వరలోనే 'హరి హర వీరమల్లు' సెట్స్ లో అడుగు పెట్టనున్నారని సమాచారం.
![]() |
![]() |