![]() |
![]() |

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్టార్ హీరోలతో వరుస భారీ ప్రాజెక్ట్ లు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే భారీ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందని ఇప్పటికే దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కూడా త్వరలో తమ బ్యానర్ లో సినిమాలు చేయబోతున్నట్లు దిల్ రాజు చెప్పారు. అయితే ఈ ప్రాజెక్ట్స్ కోసం ఊహించని దర్శకులను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.
శైలేష్ కొలను దర్శకత్వంలో 'విశ్వంభర', ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'జటాయు' అనే భారీ ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నట్లు కూడా ఇప్పటికే దిల్ రాజు తెలిపారు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఒక దానిలో ఎన్టీఆర్ నటించే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా 'జటాయు'ని తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని దిల్ రాజు చెప్పడం చూస్తుంటే.. అందులో ఎన్టీఆర్ నటించడం ఖాయమైందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఇంద్రగంటి ఇప్పటిదాకా యంగ్ హీరోలతో మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే చేశారు. అలాంటిది జటాయు లాంటి భారీ ప్రాజెక్ట్, అందునా ఎన్టీఆర్ హీరో అంటే ఆయన ఎలా డీల్ చేస్తారోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో 'వకీల్ సాబ్' తర్వాత మరో సినిమాని నిర్మించడానికి సిద్ధమవుతున్నారు దిల్ రాజు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అనిల్ రావిపూడి తన సినిమాల్లో ఎక్కువగా వినోదానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. మరోవైపు పవన్ అభిమానులు కూడా తమ హీరోని ఎక్కువగా యాక్షన్ ఎంటర్టైనర్స్ లో చూడటానికి ఇష్టపడుతుంటారు. అయితే కొంతకాలంగా ఎంటర్టైన్మెంట్ డోస్ తగ్గించిన పవన్.. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో ఎలా కనిపిస్తాడోనన్న ఆసక్తి నెలకొంది.
దిల్ రాజు బ్యానర్ లో అటు ఎన్టీఆర్ సినిమా గానీ, ఇటు పవన్ సినిమా గానీ పట్టాలెక్కలంటే ఇంకా చాలా సమయం పట్టే అవకాశముంది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే 'వార్-2'తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూడూ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు కావడంతో.. ఇవి పూర్తి కావడానికి రెండేళ్ళు పట్టే అవకాశముంది. ఇక పవన్ విషయానికొస్తే ఇప్పటికే ఆయన చేతిలో హరి హర వీరమల్లు, ఓజీ, PKSDT, ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా పలు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ వైపు లుక్ వేస్తారేమో చూడాలి. మరోవైపు అనిల్ రావిపూడి సైతం ప్రస్తుతం బాలకృష్ణ చిత్రంతో బిజీగా ఉన్నారు.
![]() |
![]() |