![]() |
![]() |
మార్చి 30వ తేదీన నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా విడుదలవుతోంది. ఈ చిత్రంతో నానీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ట్రైలర్ కి బాగా హైప్ వచ్చింది. నాని కెరీర్ లో మొట్టమొదటిసారిగా పూర్తి మాస్ మసాలా క్యారెక్టర్ ను చేశారు. మాసిన గడ్డంతో లుక్కుతో గ్రామీణ యువకుడిగా రఫ్ అండ్ టఫ్ పాత్రలో నాని కనిపిస్తున్నారు. నాని గతంలో కృష్ణార్జున యుద్ధం, జెండాపై కపిరాజు, పైసా చిత్రాలలో మాస్ క్యారెక్టర్స్ ట్రై చేశారు. కానీ అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. కానీ దసరా పాత్ర మాత్రం అందరికీ బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి. ఊరమాసుగా నాని కనిపిస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది.
తాజాగా ఆయన శౌర్యవ్ అనే కొత్త దర్శకునితో తన 30వ చిత్రాన్ని ప్రారంభించారు. ఇందులో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందనుందని సమాచారం. దసరాలో పూర్తి మాస్‌గా కనిపిస్తే 30వ చిత్రంలో ఫుల్ క్లాసు సెంటిమెంట్ ని నాని టచ్ చేస్తున్నారు. అంటే రెండు చిత్రాలు.... రెండు విభిన్నమైన కథలు... పాత్రలలో నాని కనిపించనున్నారు. జెర్సీలో తండ్రి కొడుకుల అనుబంధం చూపించారు. నాని 30లో కొత్త దర్శకుడు తండ్రీ కూతుర్ల మధ్య అనుబంధాన్ని సెంటిమెంట్ ని తెరకెక్కించనున్నారట. ఈ చిత్రాన్ని కూడా ఇదే ఏడాది విడుదల చేయాలని నాని భావిస్తున్నారు. ఇక నాని నటిస్తున్న హిట్ 3చిత్రం త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే డైరెక్టర్ శైలేష్ కొలను వెంకటేష్ తో సైంధవ్ చిత్రంలో బిజీగా ఉండడం వల్ల ఈ చిత్రం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
![]() |
![]() |