![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీరయ్య' రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ చిత్రం రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. మూడో వారంలోనూ కలెక్షన్ల జోరు చూపించే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో మూవీ టీమ్ భారీ సక్సెస్ మీట్ ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరవుతుండటం విశేషం.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకుడు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో అలరించాడు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి కామెడీ టైమింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వింటేజ్ మెగాస్టార్ ని చూడటానికి పెద్ద ఎత్తున థియేటర్లకు కదిలారు. ఇక చిరు-రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఆ స్థాయిలో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ భారీ విజయంలో మెగా ఫ్యాన్స్ బాగా ఉత్సాహంగా ఉన్నారు. వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ మైత్రి మేకర్స్ భారీ సక్సెస్ మీట్ నిర్వహించడానికి సిద్ధమైంది. 'వీరయ్య విజయ విహారం' పేరుతో రేపు(జనవరి 28న) సాయంత్రం హన్మకొండ యూనివర్సిటీ కాలేజ్ లో జరగనున్న ఈ వేడుకకు మూవీ టీమ్ తో పాటు రామ్ చరణ్ కూడా హాజరవుతున్నాడు.
![]() |
![]() |