![]() |
![]() |

ప్రతి అమ్మాయికీ సొంత ఇల్లు అనేది ఓ కల! తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటిని అలంకరించుకోవడం అంటే ఆమెకు మహా ఇష్టమైన పని. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అందుకు మినహాయింపు కాదు. తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి తన సొంత ఇంటి కలను నిజం చేసుకుంది. పెళ్లాడేందుకు తొమ్మిది రోజుల ముందుగానే, తమ కొత్త ఇంటిని అలంకరించుకోవడంలో కాజల్, గౌతమ్ బిజీ బిజీగా గడిపారు. ఆ ఇల్లు ఎలా ఉంటుందో తాజాగా ఓ వీడియో క్లిప్ ద్వారా షేర్ చేసింది కాజల్. దాంతో హోమ్ డెకరేషన్‌కు సంబంధించిన తమ సరికొత్త వెంచర్‌ను కూడా ఆమె ప్రకటించింది.

తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా డిసెంబర్ 22న తమ కొత్త వెంచర్‌కు 'కిచ్డ్' (Kitched) అని పేరు పెట్టినట్లు వెల్లడించింది కాజల్. అది హోమ్ డెకరేషన్ లేబుల్ కావడం గమనార్హం. దాంతో పాటు షేర్ చేసిన వీడియోలో ఆ ఇద్దరూ తమ ఇంట్లో కూర్చొని, తమ సొంత ఇంటిని ఎలా తయారుచేసుకున్నారనే జర్నీ గురించి మాట్లాడుకుంటూ కనిపించారు. అంతే కాదు, ఆ బ్యూటిఫుల్ హౌస్‌ను ఎలా డెకరేట్ చేసుకున్నారో కూడా అందులో చూపించారు.

తన బాయ్‌ఫ్రెండ్ గౌతమ్‌ను అక్టోబర్ 30న పెళ్లాడింది కాజల్. ఆ తర్వాత ఆ ఇద్దరూ హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు. ఈ సందర్భంగా వారు షేర్ చేసిన పిక్చర్స్ సోషల్ మీడియాను హీటెక్కించాయి.

![]() |
![]() |