Home  »  News  »  రామ్ చరణ్, ఉపాసన జంటకు కవలలు.. మెగాస్టార్ కి మనవడు! 

Updated : Jan 31, 2026

 

రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. వారికి కవలలు జన్మించారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

 

"రామ్ చరణ్ ఉపాసనలకు కవలలు - ఒక మగబిడ్డ, ఒక ఆడపిల్ల జన్మించారని తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ చిన్నారులను మా కుటుంబంలోకి స్వాగతించడం గ్రాండ్ పేరెంట్స్ గా మాకు అపారమైన ఆనందాన్ని అందించింది. ప్రతి ఒక్కరి ప్రార్థనలు, ప్రేమ, ఆశీర్వాదాలు మరియు శుభాకాంక్షలకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము" అని చిరంజీవి ట్వీట్ చేశారు.

 

 

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20, 2023న ఒక పాప జన్మించింది. పాప పేరు క్లీంకార. ఇప్పుడు ఈ దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. కవలలుగా ఒక పాప, ఒక బాబు జన్మించారు. 

 

మెగాస్టార్ కుటుంబం మనవరాళ్లతో కళకళలాడుతోంది. క్లీంకారతో పాటు చిరంజీవి కూతుళ్ళకు కూడా ఆడపిల్లలే. ఇప్పుడు చిరంజీవి కుటుంబంలోకి మొదటి మనవడు వచ్చాడు.

 

https://x.com/KChiruTweets/status/2017666595624259974?s=20

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.