Home  »  News  »  Peddi: ఊరమాస్ జాతర మొదలైంది.. రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ ఎలా ఉందంటే

Updated : May 18, 2026

 

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తన అభిమానుల నీరీక్షణకి తెరదించుతూ పెద్ది(Peddi)ట్రైలర్ ని కొంచం సేపటి క్రితమే రిలీజ్ చేసాడు. ముంబైలో జరిగిన భారీ ఈవెంట్‌లో విడుదలైన  ట్రైలర్ రిలీజైన కొన్ని సెకన్లకే సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. 1980ల నాటి ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యం, సాంప్రదాయ ఆటల  కలయికతో  పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. 


సుమారు మూడు నిమిషాల నిడివి గల  ట్రైలర్ మొదలైనప్పటి నుండి ముగిసే వరకు ప్రతి ఫ్రేమ్ ఎంతో పవర్‌ఫుల్‌గా, రోమాంచితంగా సాగింది.   రామ్ చరణ్ కనబరిచిన స్క్రీన్ ప్రెజెన్స్ చూసి మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మునుపెన్నడూ చూడని విధంగా ఒక పక్కా లోకల్ మాస్ విలేజ్ క్యారెక్టర్‌లో చరణ్ జీవించేశారు. బాడీ లాంగ్వేజ్,  రఫ్ లుక్, ఉత్తరాంధ్ర యాసతో చెప్పిన డైలాగులు థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయం. ముఖ్యంగా ట్రైలర్‌లో చిరంజీవి ముందే లీక్ చేసిన మీరందరు నేను ఆడానని అనుకుంటున్నారు సారు.. కానీ నేను పోరాడాను సారు. అనే డైలాగ్ వింటుంటే గూస్‌బంప్స్ రావడం గ్యారెంటీ. 

చరణ్ యాక్షన్ ఎపిసోడ్స్, కుస్తీ బరిలో చూపించిన రౌద్రం సినిమాపై ఉన్న అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి.జాన్వీ కపూర్ ఊర మాస్  లుక్‌లో మెరిసిపోయింది. లంగా ఓణీ ధరించి అచ్చమైన పల్లెటూరి పడచుగా చాలా అందంగా కనిపిస్తోంది. చరణ్ జాన్వీ  మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలో ఒక ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని ట్రైలర్ హింట్ ఇచ్చింది.  శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, హిందీ నటుడు దివ్యేందు శర్మ క్యారెక్టర్స్ కి   కథలో ఎంతో ప్రాధాన్యత ఉన్నట్లు విజువల్స్ చూస్తుంటే తెలుస్తోంది. విలనిజం కూడా చాలా ఇంటెన్సివ్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. 


Also read: Balakrishna: లగ్జరీ కార్లు, కోట్లాది ఆస్తులు... కానీ చివరకి పాతాళ భైరవి అంజిగాడు విషాద కథ


ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ట్రైలర్‌ని  మరో స్థాయికి తీసుకెళ్లింది. విజువల్స్‌కు తగ్గట్లుగా ఆయన ఇచ్చిన మ్యూజిక్ ప్రతి సీన్‌ని   ఎలివేట్ చేసింది. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ 1980ల నాటి పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ట్రైలర్ చివర్లో వచ్చే ఒక మైండ్ బ్లోయింగ్ క్రాస్ ఓవర్ షాట్ ప్యూర్ మాస్ సినిమా లవర్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది. మొత్తంమీద 'పెద్ది' ట్రైలర్ కేవలం సినిమా ప్రమోషన్ కోసమే కాదు, బాక్సాఫీస్ దగ్గర సృష్టించబోయే సునామీకి ఒక శాంపిల్ లాంటిదని చెప్పవచ్చు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్నపెద్ది  టాలీవుడ్‌లో కొత్త రికార్డులను సృష్టించడంతో పాటు బుచ్చిబాబుని అగ్ర దర్శకుడిగా నిలిచేలా చెయ్యడం ఖాయంగా కనిపిస్తోంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.