Home  »  News  »  Peddi: బాక్సాఫీస్ వద్ద పెద్ది సునామీ.. రిలీజ్ కి ముందే నిర్మాత జేబులోకి ఎన్ని కోట్లో తెలుసా!

Updated : May 18, 2026

 

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో 'పెద్ది'(Peddi)ట్రైలర్ ఈ రోజు ముంబై వేదికగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ తో పాటు పెద్ది లవర్స్ ట్రైలర్ కోసం ఎంతో ఆత్రుతతతో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ది హంగామాని గమనిస్తున్న అందరకి పెద్ది నిర్మాత జేబుల్లోకి రిలీజ్ కి ముందే  కోట్ల రూపాయలు అనే  ఆసక్తికర న్యూస్ కంటపడింది. దీంతో పెద్ది సునామి ఎలా ఉందో అనే విషయం తెలుస్తుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

పెద్ది థియేట్రికల్ హక్కులని చూసుకుంటే నైజాం ఏరియా హక్కులు అత్యధికంగా 63 కోట్ల రూపాయలకి అమ్ముడుపోగా, ఆంధ్రా హక్కులు 75 కోట్ల రూపాయల భారీ ధరకి  క్లోజ్ అయ్యాయి. రాయలసీమ  హక్కులు  27 కోట్ల రూపాయల పలికాయి. ఇలా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 165 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ ని రాబట్టింది.  ఓవర్సీస్ హక్కులు 40 కోట్ల రూపాయల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఇలా ఏకంగా 200 కోట్ల రూపాయల అమౌంట్ నిర్మాత జేబులోకి రిలీజ్ ముందే వచ్చినట్లయింది.

Also read: Adivi sesh: పవన్ కళ్యాణ్ పై అడివిశేష్ వ్యాఖ్యలు వైరల్.. ఆ పార్టీలో జాయిన్ అవుతాడా అంటున్న ఫ్యాన్స్ 

   
క్రికెటర్ గా, కుస్తీ వీరుడిగా కనిపించబోతున్న చరణ్ క్యారక్టర్ కి సంబంధించి మరో కొత్త అప్ డేట్ ఈ రోజు జరిగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వస్తుందేమో చూడాలి. ఈ ఈవెంట్ లో మూడో సాంగ్ కూడా రిలీజ్ కాబోతుండటం ఫ్యాన్స్ కి బోనస్ అని చెప్పవచ్చు. జూన్ 3 ప్రీమియర్స్ నుంచి పెద్ది వరల్డ్ వైడ్ గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.