Home  »  News  »  Peddi: పెద్ది ఫస్ట్ డే కొట్టబోయే కలెక్షన్స్ ఇవేనా!

Updated : Jun 3, 2026


మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది'(Peddi)గా వరల్డ్ వైడ్ థియేటర్స్ లో ల్యాండ్ కానున్నాడు. దీంతో మెగా అభిమానుల్లో, మూవీ లవర్స్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది. ఫస్ట్ డేకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ యుఎస్ నుంచి ఉత్తరాంధ్ర వరకు భారీ ఎత్తున జరగడంతో తొలి రోజు పెద్ది సాధించే కలెక్షన్స్ పై ఫ్యాన్స్ తో పాటు సినీ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది.

ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం, 'పెద్ది' చిత్రం మొదటి రోజు ప్రీమియర్స్ తో కలుపుకొని వరల్డ్  బాక్సాఫీస్ వద్ద సుమారు 100 కోట్ల గ్రాస్ ని రాబట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ చూపిస్తున్నాయి.ఓవర్సీస్ మార్కెట్లలో 'పెద్ది' అడ్వాన్స్ బుకింగ్స్ వన్ మిలియన్ కి చేరింది. ఇండియా వైడ్ గా లెక్కలు రావాల్సి ఉంది. పైగా ఈ రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. ఈ లెక్కన 100 కోట్లు సాధించే అవకాశం ఉందని టాక్  పాజిటివ్‌గా వస్తే, లాంగ్ రన్‌లో సరికొత్త రికార్డులని  అధిగమించడం ఖాయమని అంటున్నారు.


Also read: Michael jackson: మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. 7000 కోట్లు 

మొన్న విజయవాడ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బుచ్చిబాబు తో పాటు మిగతా నటీనటులు,నిర్మాతలు చెప్పిన దాన్ని బట్టి పెద్ది పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. రెహ్మాన్ మ్యూజిక్ నుంచి వచ్చిన సాంగ్స్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.