అడవి శేషు(adai seshu)హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఎస్ ఎస్ క్రియేషన్స్ పతాకంపై 'డెకాయిట్'(decoit)అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.నిన్న ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ అయ్యింది.అందులో తనని కాపాడినా కానీ,ఒదిలేసినాది, తను ఏంటో అసలెవరో రేపు తెలుస్తాది.'అంటూ అడివి శేష్ డెకాయిట్ లోని హీరోయిన్‌ని పరిచయం చేస్తున్నాడు.హీరోయిన్ ముఖం రివీల్ కాకుండా కేవలం కళ్ల వరకు కనిపించేలా పోస్టర్ ఉండటంతో ఆ హీరోయిన్ ఎవరా అనే క్యూరియాసిటీ అందరిలో కలిగింది.
ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది.ఆమె ఎవరో కాదు సీతారామం,హాయ్ నాన్న వంటి సూపర్ హిట్స్ తో టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన మృణాల్ ఠాకూర్(mrunal thakur)పైగా నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ కి కంటిన్యూగా మరో కొత్త పోస్టర్ ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది.అందులో ప్రేమించావు,కానీ మోసం చేసావు, విడిచి పెట్టను, తేలాల్సిందే అనే క్యాప్షన్ ని అడవి శేషు పెట్టగా ,దీనికి స్పందించిన మృణాల్ వదిలేసాను.కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను,హ్యాపీ బర్త్ డే అనే క్యాప్షన్ ని ఉంచింది.
నిజానికి తొలుత డెకాయిట్ లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా చేస్తుందని మేకర్స్ ప్రకటించారు.అడవి శేషు,శృతి మధ్య చిన్నపాటి టీజర్ కూడా రిలీజై మూవీ పై ఆసక్తిని కలిగించడంతో పాటుగా రికార్డు వ్యూస్ ని కూడా సృష్టించింది.ఇప్పుడు శృతి ప్లేస్ లోనే మృణాల్ హీరోయిన్ గా చేస్తుంది. దీంతో ఈ సినిమాపై ప్రతి ఒక్కరిలో పూర్తి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.భీమ్స్ సిసిరోలియో సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి షేనియల్ డియో(Shaneil Deo)దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.