![]() |
![]() |

-రాజా సాబ్ యూనిట్ సంబరాలు
-మారుతి చెప్పిన మాటల్లో అర్ధం ఏంటి
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-తొలి రోజు ఎంత
రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే. ఈ మేరకు మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మారుతీ(Maruthi)మాట్లాడుతు చిన్న దర్శకుడు అయిన నన్ను నమ్మి రాజా సాబ్ తో అవకాశం ఇచ్చిన ప్రభాస్ ని నా లైఫ్ లో మర్చిపోను. రాజా సాబ్ కోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డాను. ఎప్పటికప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ,ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ తీసుకునే రాజా సాబ్ ని తెరకెక్కించాను. రాజాసాబ్ బాగోలేదని కొంత మంది చెప్తున్నారు. రిజల్ట్ విషయంలో అప్పుడే నిర్ణయం తీసుకోవద్దు. పది రోజులు అయితే గాని అసలు విషయం తెలుస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నాతో మాట్లాడుతు మా ప్రభాస్ సినిమా ఫస్ట్ రోజు టాక్ ఇలాగే వస్తుంది. పది రోజులు తర్వాత అసలు టాక్ తెలుస్తుందని చెప్పారు.
Also read: బెనిఫిట్ షో, టికెట్ రేట్స్ ఇలాగే ఉండాలి..తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ
కొత్త కంటెంట్ ప్రేక్షకులకి రీచ్ కావడానికి టైం పడుతుంది. కామన్ ఆడియెన్స్ కి మాత్రం సినిమా బాగా నచ్చింది. ఈ విషయాన్నీ చాలా మంది చెప్పారు.ఇండియన్ సినిమా హిస్టరీ లో రాజా సాబ్ క్లైమాక్స్ లాంటిది రాలేదని కూడా చెప్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరు ఓల్డ్ గెటప్ గురించి అడుగుతున్నారు. ఈ సాయంత్రం ఆరు గంటల షో నుంచి ఓల్డ్ గెటప్ ప్రభాస్ కూడా సినిమాలో కనిపిస్తాడు. టోటల్ మూవీ కొంత లెంత్ కూడా తగ్గిస్తున్నామని మారుతీ చెప్పుకొచ్చాడు.
.webp)
![]() |
![]() |