Home  »  News  »  Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్ బిల్లు వైరల్.. వాటర్ బాటిల్ రేటు చూస్తే షాకవుతారు

Updated : May 16, 2026

 


సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu)ప్రస్తుతం తన కలల ప్రాజెక్ట్ వారణాసి(Varanasi)తో బిజీగా ఉన్నాడు. రాజమౌళి(Ss Rajamouli)గత చిత్రాల కంటే బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే నమ్మకం అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఉంది. రీసెంట్ గా మహేష్ బాబు హోటల్ కి  సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సమర్ధించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు పోటాపోటీ కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.

 ఏషియన్ గ్రూప్, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ భాగస్వామ్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో 'ఏఎన్‌ ప్యాలెస్ హైట్స్'(As palace Hights) అనే లగ్జరీ రెస్టారెంట్‌ని నడుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒక హైదరాబాద్ బేస్డ్ ఫుడ్ బ్లాగర్ ఈ రెస్టారెంట్‌ ని  సందర్శించి  షేర్ చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఆ వీడియోలో సదరు బ్లాగర్ రెస్టారెంట్ యొక్క అంబియెన్స్, రాయల్ లుక్‌ ఎంతో అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. వారు ఆర్డర్ చేసిన మటన్ బిర్యానీ టేస్ట్  నెక్ట్స్ లెవల్‌లో ఉందని, హైదరాబాద్‌లోనే అత్యుత్తమ మటన్ బిర్యానీలలో ఇది ఒకటి అని రేటింగ్ ఇచ్చారు. కానీ, చివర్లో అతను చూపించిన మెనూ కార్డు ధరలు, బిల్లు మొత్తం చూసి సామాన్య జనం నోరెళ్లబెడుతున్నారు.

సదరు వీడియోలో  కేవలం ఒక చికెన్ టిక్కా స్టార్టర్ ధర  700 ,ఒక మటన్ బిర్యానీ ధర  600 గా ఉంది. కేవలం ఒక స్టార్టర్, ఒక బిర్యానీ మాత్రమే ఆర్డర్ చేసినప్పటికీ, టాక్సులు మరియు ఇతర బెవరేజెస్ అన్ని కలుపుకుని ఫైనల్ బిల్లు ఏకంగా 1,853 కి చేరింది. అయితే ఈ బిల్లులో బిర్యానీ ధర కంటే కూడా అక్కడ లభించే సాధారణ డ్రింక్స్ ధరలు  ఎక్కువగా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎందుకంటే బయట కేవలం 20 రూపాయలకి  దొరికే వాటర్ బాటిల్ ధర 299 రూపాయలుగా ఉంది. అంతేకాదు, సాధారణంగా మార్కెట్లో 30 నుండి 40 రూపాయల లోపు లభించే ఒక డైట్ కోక్ కాన్ ధరని 180 గా మెన్షన్ చేశారు. ఒక వాటర్ బాటిల్ కోసం దాదాపు 300 రూపాయలు వసూలు చేయడంపై సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.


Also read: Karuppu: వీరభద్రుడు మొదటి రోజు కలెక్షన్స్ ఇవే.. రుద్ర తాండవం తప్పదా!


ఈ బిల్లు వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "ఒక వాటర్ బాటిల్‌కు  299 రూపాయలు వసూలు చేయడం ఏంటి. ఆ మొత్తం డబ్బులతో బయట రెండు కేజీల మటన్ కొనుక్కుని ఇంట్లోనే ప్రశాంతంగా వండుకుని తినొచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం అది  ఒక సెలబ్రిటీ బ్రాండ్, బంజారాహిల్స్ లాంటి పోష్ ఏరియాలో అద్భుతమైన ఫైన్ డైనింగ్ ఎక్స్‌పీరియన్స్, రాయల్ అంబియెన్స్ అందించినప్పుడు ఆ మాత్రం ప్రీమియం ధరలు ఉండటం సహజమే అంటు సమర్థిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, హైదరాబాద్ లగ్జరీ హోటళ్లలో సామాన్యులకి  ఫుడ్ తినడం అంత సులువు కాదనే విషయాన్ని ఈ వైరల్ బిల్లు మరోసారి నిరూపించింది.  

 



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.