Home  »  News  »  Hey Balwanth: ఓటీటీలోకి సుహాస్ 'హే బల్‌వంత్'.. తండ్రి బిజినెస్ తెలిస్తే మైండ్ బ్లాక్!

Updated : Mar 24, 2026

టాలీవుడ్ యంగ్ యాక్టర్ సుహాస్ డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ యాక్టర్, ఇటీవల 'హే బల్‌వంత్' అనే సినిమాతో వెండితెరపై సందడి చేశాడు. థియేటర్లలో పరవాలేదు అనిపించుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ వేదికపై అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌కు సంబంధించి తాజాగా కీలక అప్‌డేట్ వచ్చేసింది. (Hey Balwanth)

స్ట్రీమింగ్ అప్‌డేట్
సుహాస్, నరేష్, శివానీ నగరం ప్రధాన పాత్రలలో నటించిన ‘హే బల్‌వంత్’ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం మే 31 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది. థియేటర్లకు మిస్ అయిన ప్రేక్షకులు, అలాగే సుహాస్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులు ఈ అప్‌డేట్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

కథ ఏంటంటే..
కృష్ణ(సుహాస్)కి చిన్నప్పటి నుంచి తన తండ్రి బలవంత్(నరేష్) లాగా పెద్ద బిజినెస్‌మ్యాన్ అవ్వాలనేది గోల్. ఎప్పటికైనా తండ్రి బిజినెస్‌ని టేకోవర్‌ చేసి.. గొప్ప పేరు తెచ్చుకోవాలన్నదే లక్ష్యం. అందుకే చదువు పూర్తి కాగానే.. బిజినెస్‌ని అప్పజెప్పమని తండ్రిని బలవంత పెడతాడు. దీనికి బల్‌వంత్‌ మొదట నో చెప్పినా.. కొన్ని అనుకోని పరిస్థితుల్లో అది కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది. అయితే, అప్పటివరకు తండ్రి బిజినెస్‌ గురించి ఏవేవో కలలు కన్న కృష్ణకి.. తీరా ఆ బిజినెస్ ఏంటన్నది తెలిశాక మతిపోతుంది. జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. ప్రేమించిన అమ్మాయి మిత్ర (శివానీ నగరం)కి కూడా దూరమవ్వాల్సి వస్తుంది. అసలు బలవంత్ చేసే బిజినెస్‌ ఏంటి? దానివల్ల కృష్ణ ప్రేమకు వచ్చిన చిక్కేంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

ఈ సినిమాలో సుహాస్ తన మార్క్ సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఒక సాధారణ యువకుడికి ఎదురయ్యే వింతైన పరిస్థితులు, అందులో ఉండే హ్యూమర్, ఎమోషన్స్‌ను దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించాడు. ఒక చిన్న పాయింట్‌ను తీసుకుని దాని చుట్టూ అల్లిన కథనం ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. ముఖ్యంగా సుహాస్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

'కలర్ ఫోటో' సినిమాతో మంచి తెచ్చుకున్న సుహాస్, ఆ తర్వాత 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' వంటి సినిమాలతో తన మార్కెట్‌ను పెంచుకున్నాడు. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా కథా బలం ఉన్న చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు. ఈ క్రమంలోనే 'హే బల్‌వంత్' కూడా సుహాస్ కెరీర్‌లో ఒక మంచి ప్రయత్నంగా నిలిచింది. 

థియేట్రికల్ రన్ సమయంలో ఈ సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాలోని సింపుల్ ఎమోషన్స్‌ను బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Also Read: 'హే బల్‌వంత్' మూవీ రివ్యూ






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.