Home  »  News  »  'శ్రీనివాస మంగాపురం' నుంచి 'గుండె పేలిపోతోందే' సాంగ్ రిలీజ్.. రీసెంట్ బెస్ట్ సాంగ్!

Updated : Jun 16, 2026

టాలీవుడ్‌ లో విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్రేజీ డైరెక్టర్ అజయ్ భూపతి. 'ఆర్‌ఎక్స్ 100', 'మంగళవారం' వంటి బోల్డ్ అండ్ రా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన, ఇప్పుడు సరికొత్త ఎమోషనల్ లవ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ చిత్రంలో ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ వారసులు వెండితెరకు పరిచయం కాబోతుండటం విశేషం. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి 'గుండె పేలిపోతోందే' (Gunde Pelipothondhe) సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ను టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ అత్యంత హృద్యంగా స్వరపరిచారు. ప్రముఖ స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి తన అద్భుతమైన గాత్రంతో ఈ పాటను పాడగా, స్టార్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. "లక్ష పున్నముల వెలుగులు కలిసిన నక్షత్ర కాంతి నా ముందుంటే.. దేవతలందరి దివ్య రూపములు ఒకటయ్యేలాగ దర్శనమిస్తే.. ఆకాశమంత అణుబాంబు వచ్చి హఠాత్తుగా నా ముందు పడితే.. పేలిపోతుందే గుండె పేలిపోతుందే" అంటూ సాగే ఈ పాట లిరిక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రేయసిని చూసినప్పుడు ఓ ప్రేమికుడి గుండెల్లో కలిగే తీపి అలజడిని, ఆ అనుభూతిని చంద్రబోస్ తన కలం నుంచి జాలువార్చిన పదాలతో ఎంతో అందంగా వర్ణించారు.

ఈ లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. పల్లెటూరి వాతావరణం, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు, విందు భోజనాలు, అలాగే శ్రీనివాస మంగాపురం టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌ లో వచ్చే సన్నివేశాలు ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కొత్త జోడీ జయకృష్ణ ఘట్టమనేని మరియు రాషా థడాని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఫ్రెష్‌గా ఉంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ క్లాసిక్ లవ్ స్టోరీని తలపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక కీలకమైన పాత్రలో నటిస్తుండటం సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్. ఈ అందమైన భావోద్వేగాల ప్రేమకావ్యాన్ని 2026 జూలై 9న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.