![]() |
![]() |

-కార్తీ సినిమాకి షాక్
-12 న రిలీజ్ ఉంటుందా!
-చెన్నై కోర్ట్ ఏం చెప్పింది
-ఫైనాన్షియల్ ప్రాబ్లమా!
తమిళ, తెలుగు భాషల్లో సమానమైన క్రేజ్ ని సంపాదించిన కార్తీ(Karthi)ఈ నెల 12 న 'వా వాతియార్'(vaa vaathiyar)అనే కొత్త చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టబోతున్నాడు. తెలుగులో 'అన్నగారు వస్తారు' అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ప్రచార చిత్రాలు బాగుండటంతో కార్తీ ఈ సారి బిగ్గెస్ట్ హిట్ ని అందుకోవడం ఖాయమనే నమ్మకం అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో ఏర్పడింది. కానీ ఇప్పుడు 'వా వాతియార్' అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా లేదా అనే టెన్షన్ లో ఉన్నారు.
'వా వాతియార్' ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె. ఇ. జ్ఞానవేల్ రాజా(K.e Gnanavel Raja)నిర్మించారు. కార్తీకి జ్ఞానవేల్ రాజా బంధువు కూడా. చెన్నై చెందిన అర్జున్‌లాల్ అనే ఫైనాన్షియర్ వద్ద జ్ఞానవేల్ రాజా గతంలో 10.35 కోట్లరూపాయిల రుణం తీసుకున్నాడు. ప్రస్తుతం సదరు అప్పు వడ్డీతో కలిపి 21.78 కోట్లకి చేరింది. దీంతో అర్జున్ లాల్ చెన్నై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసాడు. సదరు పిటిషన్ లో జ్ఞానవేల్ రాజా తనకి రావాల్సిన అమౌంట్ ని ఇవ్వకుండా కొత్త సినిమాని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. బకాయిలు పూర్తిగా క్లియర్ చేసే వరకు ‘వా వాదియార్’ విడుదలని ఆపాలని పిటిషన్ లో పొందుపరిచాడు. విచారణ జరిపిన హైకోర్టు 'వా వాదియార్’ విడుదలపై మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణ ఈ నెల 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా కూడా ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎనిమిదవ తారీఖున తీర్పు ఎలా వస్తుందన్న టెన్షన్ లో ఉన్నారు.
also read: బాలయ్య, బోయపాటి లు నిర్మాతలతో భేటీ.. రిలీజ్ పై మరికాసేపట్లో ప్రకటన
ఇండస్ట్రీ వర్గాలు ఈ విషయంపై స్పందిస్తు విచారణలోపు జ్ఞానవేల్ రాజా డబ్బు చెల్లించకపోతే మూవీ విడుదల మరింత ఆలస్యం కావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కార్తీ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి(Krithi Shetty)జత కట్టగా సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనందరాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్ కీలక క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు. నలన్ కుమారస్వామి(nalan kumarasamy)దర్శకుడు.
![]() |
![]() |