![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం(TVK) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే 2025, సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన టీవీకే పార్టీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జనవరి 12న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా విజయ్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది.
కరూర్ తొక్కిసలాట ఘటనపై మొదట తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ జరపగా.. ఆ తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. తాజాగా టీవీకే అధినేత విజయ్ కి నోటీసులు ఇచ్చింది. జనవరి 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
కాగా, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన నటించిన లాస్ట్ మూవీ 'జన నాయగన్' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: రాజా సాబ్, జన నాయగన్ థియేటర్స్ ఇష్యూ.. నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు!
![]() |
![]() |