అల్లుఅర్జున్(allu arjun)నటించిన పుష్ప 2(pushpa 2)డిసెంబర్ 5 న రిలీజ్ అవుతున్న సందర్భంగా,ముందు రోజైన డిసెంబర్ 4 న చాలా ఏరియాల్లో బెనిఫిట్ షోస్ వెయ్యడం జరిగింది.ఈ క్రమంలోనే హైదరాబాద్ సంధ్య థియేటర్ లో కూడా బెనిఫిట్ షో వేశారు.భారీగా అభిమానులు తరలిరావడంతో పాటుగా అల్లు అర్జున్ కూడా షో కి రావడంతో తొక్కిసలాట జరిగింది.దీంతో రేవతి అనే మహిళ చనిపోగా,ఆమె కుమారుడు శ్రీతేజ్ సంఘటన జరిగిన రోజు నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
శ్రీతేజ్(sritej)ఆరోగ్యం కొద్దీ కొద్దిగా మెరుగవుతున్నట్టుగా తెలుస్తుంది.ఫీడింగ్ తీసుకోవడంతో పాటుగా,కళ్ళు కూడా తెరుస్తున్నాడని,గొంతుకి సర్జరీ చేసి ఆ దారి నుంచి ఫ్లూయిడ్స్ ఎక్కించడం వల్లే బాబు ఆరోగ్యం కుదుటపడుతున్నట్టుగా తెలుస్తుంది.మరికొన్ని రోజులు గడిస్తే బాబు కోలుకుంటాడని,ఈ విషయంపై డాక్టర్స్ అధికార ప్రకటన కూడా చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతానికి అయితే సమర్ధవంతమైన వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్ పైనే శ్రీతేజ్ కి ట్రీట్ మెంట్ జరుగుతుంది.