Home  »  News  »  Lenin: అఖిల్ అక్కినేని 'లెనిన్' మళ్ళీ వాయిదా.. అసలు కారణం ఇదే!

Updated : Jun 13, 2026

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' (Lenin) విడుదల మరోసారి వాయిదా పడనుందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. కింగ్ అక్కినేని నాగార్జున స్వయంగా ఈ సినిమా ఫస్ట్ కట్ చూసి, థియేటర్లలో ఈసారి సరికొత్త అఖిల్‌ను చూస్తారంటూ ఎంతో కాన్ఫిడెంట్‌గా ప్రశంసలు కురిపించారు. అఖిల్ సరసన టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేశాయి. అయితే, జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్, అనుకోకుండా జూలై నెలకు షిఫ్ట్ అయినట్లు సమాచారం.

నిజానికి 'లెనిన్' చిత్రం చాలా బాగా వచ్చిందని, ప్రొడక్షన్ పరంగా అంతా సిద్ధమైందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంతో ఉంది. అయితే, ఈసారి బాక్సాఫీస్ వద్ద అస్సలు ఛాన్స్ తీసుకోవడానికి వీల్లేదని హీరో అఖిల్ అక్కినేని భావిస్తున్నారట. సినిమా అవుట్‌పుట్‌ను మరింత ఫైన్ ట్యూన్ చేసి, ప్రేక్షకులకు బెస్ట్ క్వాలిటీతో విజువల్స్ అందించాలనే పట్టుదలతో హీరో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX), ఫైనల్ ఎడిటింగ్ వర్క్స్‌లో ఎక్కడా రాజీ పడకూడదని, ఇంకొంత సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ పర్ఫెక్ట్ ప్రొడక్ట్‌ను థియేటర్లలోకి దించాలని భావిస్తున్నారట. అందుకే జూన్ 26 రిలీజ్ డేట్‌ను మార్చాలని పట్టుబట్టడంతో, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, నాగార్జున అక్కినేని ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల టాక్.

'లెనిన్' సినిమా వాయిదా పడటం ఇదే మొదటిసారి కాదు. మొదట ఈ సినిమాను మే 1న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ఏప్రిల్ 30న వస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద అనవసరమైన క్లాష్ రాకూడదనే ఉద్దేశంతో 'లెనిన్'ను జూన్ 26కి వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత 'పెద్ది' చిత్రం కూడా వాయిదా పడినప్పటికీ, 'లెనిన్' జూన్ 26 స్లాట్‌ను ఫిక్స్ చేసుకుంది. కట్ చేస్తే, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల నాణ్యత కోసం జూన్ 26 డేట్ నుండి తప్పుకుని, జూలై 10వ తేదీన కానీ లేదా జూలై మధ్యలో కానీ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వాయిదా వార్తతో అక్కినేని అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నప్పటికీ, క్వాలిటీ కోసం ఆలస్యంగా వచ్చినా అయ్యగారు ఈసారి గ్యారెంటీగా మైండ్ బ్లోయింగ్ హిట్‌తో కంబ్యాక్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, తెలుగు చిత్ర పరిశ్రమలో జూలై నెలకు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ మరియు ట్రాక్ రికార్డ్ ఉంది. టాలీవుడ్ హిస్టరీలో పరిశీలిస్తే.. 'ఇంద్ర', 'సింహాద్రి', 'మగధీర', 'బాహుబలి' వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలన్నీ జూలై నెలలోనే విడుదలై ప్రభంజనం సృష్టించాయి. దాంతో 'లెనిన్' జూలై విడుదలను కూడా ట్రేడ్ వర్గాలు చాలా పాజిటివ్‌గా చూస్తున్నాయి. 

ఎస్.ఎస్. తమన్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్న ఈ పవర్‌ఫుల్ విలేజ్ డ్రామాతో అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకోవడం ఖాయమని మేకర్స్ నమ్ముతున్నారు. జూన్ లాస్ట్ వీక్ స్లాట్ ఖాళీ అవ్వడంతో ఇప్పుడు ఆ డేట్‌కు ఏ సినిమా వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 'లెనిన్' కొత్త అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.