తారాగణం: కిరణ్ అబ్బవరం,నయన్ సారిక,తన్వి రామ్, శరణ్య ప్రదీప్, అచ్యుత్ కుమార్,బలగం జయరామ్, అజయ్, రెడీన్ కింగ్ స్లే తదితరులు
సంగీతం: సామ్ సిఎస్
డీఓపీ: డానియెల్ విశ్వాస్, సతీష్ రెడ్డి మాసన్
రచన, దర్శకత్వం:సందీప్,సుజిత్
ఎడిటింగ్:శ్రీ వర ప్రసాద్
నిర్మాతలు: చింతా గోపాలకృష్ణ రెడ్డి
బ్యానర్: శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్మెంట్స్ ,క ప్రొడక్షన్స్
విడుదల తేదీ: అక్టోబర్ 31 ,2024
గత కొంత కాలం నుంచి వరుస పరాజయాలని చవి చూస్తున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఈ రోజు 'క'(ka)అనే ఒక విభిన్నమైన మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ట్రైలర్ తోనే మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
అబినయ్ వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) ఒక అనాధ. ఎవరైనా బాధల్లో ఉంటే చలించిపోయే మనస్తత్వం కల్గిన వాసుదేవ్ ఎంతో ఇష్టంతో పోస్ట్ మెన్ ఉద్యోగంలో చేరి మూడు గంటలకే చీకటి పడే కృష్ణ గిరి అనే గ్రామంలో పని చేస్తుంటాడు.తను అనాధ ని కాదని, తన వాళ్ళు ఎక్కడో ఉన్నారనే నమ్మకంతో ఉంటూ తను ఇచ్చే ఉత్తరాలలో ఉన్న విషయాన్ని ముందుగానే చదివి ప్రజలకి మంచి జరిగేలా చూస్తుంటాడు. అప్పటికే ఆ గ్రామంలో ఉండే అమ్మాయిలు తెల్లవారుజామున ఒక గుడికి వెళ్లి మిస్ అవ్వడం జరుగుతుంటుంది. తనకి పోస్ట్ మెన్ ఉద్యోగం ఇచ్చిన రంగారావు (అచ్యుత్ కుమార్) కూతురు సత్యభామ (నయని సారిక) వాసుదేవ్ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అదే ఊర్లో రాధ (తన్వి రామ్) టీచర్‌గా పని చేస్తుంటుంది. ఈ క్రమంలో వాసుదేవ్, రాధ ని ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి వేరు వేరు గదుల్లో ఉంచుతాడు. ఆ తర్వాత ఇద్దరు గతాన్ని మర్చిపోతారు. వాసుదేవ్ పోస్ట్ మెన్ ఎందుకు అవుదామని అనుకున్నాడు? సత్యభామ, వాసుదేవ్ ల ప్రేమ పెళ్లి దాకా వెళ్లిందా? వాసుదేవ్, రాధ ని కిడ్నాప్ చేసింది ఎవరు? అసలు రాధ కి వాసుదేవ్ కి ఉన్న సంబంధం ఏంటి? ఊళ్ళో అమ్మాయిల మిస్సింగ్ వెనుక ఉంది ఎవరు? అసలు వాసుదేవ్ జన్మ రహస్యం ఏంటి అనేదే ఈ చిత్ర కథ .
ఇంతవరకు తెలుగు సినిమాపై ఇలాంటి కథ రాలేదనే చెప్పాలి. ఒక కొత్త రకమైన పాయింట్ ని 'క' టీం పరిచయం చేసి కొత్త రకం రచయితల దర్శకుల మెదళ్ళకి మంచి పని కలిపించిందని చెప్పవచ్చు.కాకపోతే ఆ పాయింట్ కి తగ్గట్టుగా సరైన కథనాలు లేకపోవడం సినిమాకి మైనస్ గా నిలిచింది. హీరో ఎంతసేపు అదే పనిగా ఉత్తరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కృష్ణ గిరి ఊరు యొక్క ప్రత్యేకతని, ఎందుకు అమ్మాయిలు మిస్ అవుతున్నారనే విషయాలకి, హీరో హీరోయిన్ ల మధ్య ఒక చక్కని లవ్ స్టోరీ రాసుకొని ఉంటే బాగుండేది. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే మొదటి ఇరవై నిమిషాలు కథ లోకి వెళ్ళడానికి ప్రేక్షకుడికి కొంచం ఇబ్బంది కలిగినా,ఆ తర్వాత ప్రేక్షకుడు సినిమాలో లీనమవుతాడు.వాసుదేవ్ పరిచయ సన్నివేశాలు ,కృష్ణ గిరి రావడం, సత్యభామ ని చూడటం, ఊరి సమస్య ఇలాంటి వన్నీ బాగున్నా కూడా సీన్స్ రూపంలో చెప్పడంలో ఎక్కడో గందరగోళం నెలకొని ఉంది. మెస్మరైజ్ చేసే డైలుగులు కూడా లేవు. కాకపోతే మధ్య మధ్యలో వాసుదేవ్, రాధ ల మధ్య సీన్స్ రావడంతో ప్రేక్షకుడు కి మంచి రిలీఫ్ ఉంటుంది. రెడీన్ కింగ్ స్లే లాంటి కామెడీ నటుడి ని పెట్టుకొని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేదు.సెవంటీస్ లో కథ చెప్తున్నాం కాబట్టి అలాగే ఉండాలని అనుకున్నటుగా కొన్ని సీన్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ లో అయితే గత చిత్రాల ప్రభావం ఉంది.ప్రేక్షకుడి లో అసహనం కలుగుతున్నదనే టైం లో ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకండ్ ఆఫ్ పై మంచి హైప్ ని కలిగించారు.కానీ అప్పుడు కూడా పస లేని సీన్స్ వెంటవెంటనే వస్తుంటాయి. పకడ్బందీగా సీన్స్ ని తెరకెక్కించే అవకాశం ఉన్న కూడా అలా జరగలేదు. కొన్ని అవసరం లేని సీన్స్ ఉండటంతో పాటుగా ఎన్నో లాజిక్ లు ప్రేక్షకుల మెదళ్లలో మెదులుతూ ఉంటాయి. సరైనా విలన్ లేకపోవడం కూడా కొంచం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాకపోతే చివరి ఇరవై నిమిషాల్లో మూవీ ఒక రేంజ్ లో ఉంది.చూసే ప్రతి ప్రేక్షకుడి కి గూస్ బంప్స్ రావడం గ్యారంటీ.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
అభినయ్ వాసుదేవ్ క్యారక్టర్ లో కిరణ్ అబ్బవరం(kiran abbavaram)పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. అసలు ఆయన కోసమే ఆ పాత్ర పుట్టిందేమో అన్నట్టుగా చేసాడు. లవ్ యాక్షన్, సెంటిమెంట్ లో తనకి తిరుగులేదని మరో సారి నిరూపించాడు. ఇక హీరోయిన్ గా చేసిన నయన్ సారిక(nayan sarika)టీచర్ గా చేసిన తన్వీ రామ్ కూడా తమ పాత్ర పరిధి మేరకు చక్కగా చేసారు,కాకపోతే నయన్ కి మాత్రం ఆయ్ మూవీలో లాగా ,మంచి పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించడానికి అవకాశం లేకుండా పోయింది. మిగతా పాత్రల గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇక ఈ చిత్రానికి రచయిత దర్శకులు గా చేసిన సందీప్, సుజిత్ (sandeep, sujith) విషయాలకి వస్తే ఈ ఇద్దరు దర్శకులుగా హిట్ అయ్యారు కానీ రచయితగా అక్కటుకోలేకపోయారు. వాళ్ళు అనుకున్న పాయింట్ కి బలమైన సీన్స్ ఉండుంటే సినిమా హిట్ రేంజ్ ఒక లెవల్లో ఉండేది. సాంగ్స్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేకపోయినా కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. 'క ' కి ప్లస్ పాయింట్స్ లో ఇదొకటి. ఫొటోగ్రఫీ తో పాటు నిర్మాణ విలువలు,ఆర్ట్ డిపార్ట్మెంట్ పని తనం కూడా చాలా బాగుంది.
చివరి ఇరవై నిముషాలు అయితే మూవీ చాలా బాగుంది. అంతకంటే ముందు మాత్రం బలహీనమైన సీన్స్ తో సాగి ప్రేక్షకుడిని నిరుత్సాహ పరిచింది.
- అరుణాచలం