Home » Movie Reviews » హే బల్‌వంత్



Facebook Twitter Google


-సినిమా పేరు:హే బలవంత్
-న‌టీన‌టులు: సుహాస్,శివానీ నగరం,నరేష్, హర్షవర్ధన్, స్రవంతి,వెన్నెల కిషోర్, అన్నపూర్ణ,సుదర్శన్, -అజయ్ ఘోష్ తదితరులు
-సినిమాటోగ్ర‌ఫీ: మహీ రెడ్డి పండుగుల
-ఎడిట‌ర్‌: విప్లవ్ నైషధం
-మ్యూజిక్: వివేక్ సాగర్
-నిర్మాత‌: బి. నరేంద్ర రెడ్డి
-సమర్పణ: బన్నీ వాస్, వంశీ నందిపాటి
-బ్యానర్: త్రిశూల్ విజనరీ స్టూడియోస్ 
-రచన, దర్శకత్వం: గోపి అచ్చర 
-రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 20 , 2026 

 

సుహాస్(Suhas),లిటిల్ హార్ట్స్ బ్యూటీ శివాని నాగారం(Shivani Nagaram)ఈ రోజు 'హే బలవంత్'(Hey Balwanth) తో థియేటర్స్ లో అడుగు పెట్టారు. నిన్న ప్రీమియర్స్ కూడా ప్రదర్శించడం చూస్తే మేకర్స్ కి మూవీ పై ఉన్న నమ్మకం అర్థమవుతుంది. మరి ఆ నమ్మకానికి తగ్గ ఫలితం వచ్చిందా లేదా చూద్దాం.

కథ

కృష్ణ(సుహాస్) కి చిన్నప్పటి నుంచి తన తండ్రి బలవంత్(నరేష్) లాగా పెద్ద బిజినెస్ మెన్ అవ్వాలనేది గోల్. కానీ బలవంత్ మాత్రం కృష్ణ ని తన బిజినెస్ దరిదాపుల్లోకి కూడా రానివ్వడు. మిత్ర(శివాని) బిజినెస్ నడిపే వాళ్ళకి ఐడియాస్ ఇచ్చే కన్సల్టెంట్. కృష్ణ, మిత్ర ఒకరినొకరు ఇష్టపడతారు.కృష్ణ కి తన తండ్రి బిజినెస్ గురించి తెలుస్తుంది.దాంతో  తండ్రి పై ద్వేషం పెంచుకుంటాడు. పీవీపీ(హర్ష వర్ధన్) పెద్ద కోటీశ్వరుడుతో పాటు రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం. ఎంఎల్ ఏ టికెట్ కోసం ప్రయత్నిస్తుంటాడు.

దుర్గారావు( అజయ్ ఘోష్) పేరు మోసిన రౌడీ షీటర్ తో పాటు ఆర్ధికంగా బలమైన వ్యక్తి. ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న వాళ్ళతో తన కొడుకు(వెన్నెల కిషోర్) పెళ్లి చెయ్యాలని అనుకుంటాడు.బలవంత్ దగ్గర పని చేసే చెంప(స్రవంతి) ని వెన్నెల కిషోర్ ప్రేమిస్తాడు. ఈ మొత్తం క్యారెక్టర్స్ మధ్య కంబైన్డ్ గా జరిగిన కథ ఏంటి ? వాళ్ళ పరిచయానికి  దారి తీసిన పరిస్థితులేంటి? బలవంత్ చేసే బిజినెస్ ఏంటి? తన కొడుకుకి ఎందుకు చెప్పలేదు? అసలు ఎందకు చెయ్యాల్సి వచ్చింది? చివరికి సదరు బిజినెస్ విషయంలో కృష్ణ తీసుకున్న నిర్ణయం ఏంటనేదే హే బలవంత్.



ఎనాలసిస్ :

ఇలాంటి సబ్జెట్స్ పులిపై చేసే స్వారీ లాంటివి. ఏ మాత్రం తేడా వచ్చినా అసలుకే మోసం వస్తుంది. అందుకే మేకర్స్ సెకండ్ హాఫ్  లో సదరు సబ్జెట్ కి  మరో కథనం రన్ చేస్తు  దానిపైనే ఫోకస్ చేసారు. ట్రైలర్ లో కూడా రిలీజ్ చేయని సీక్రెట్ పాయింట్ కి సదరు క్యారెక్టర్స్ చేత సరైన రీజన్ చెప్పించలేకపోయారు. ఆల్కహాల్, సిగరేట్ తాగే వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు కాదు. కాకపోతే ఒక సారి అలవాటైన తర్వాత అందులో నుంచి బయటకి రావడం కష్టం. కాబట్టి  సదరు  సీక్రెట్ పాయింట్ కి ఇదే సూత్రం అన్వయించాల్సింది.ఆ తర్వాత  కృష్ణ ఆ అందరి విషయంలో చేసిన మంచి ఏంటనేది ఎంటర్ టైన్ మెంట్ కోణంలో రన్ చేసి ఉంటే బాగుండేదేమో.

దాంతో హే బలవంత్ హిట్ పొజిషన్ మరో రేంజ్ లో ఉండేది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే బలవంత్ చేసే బిజినెస్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాం. సుహాస్ చిన్నప్పటి సీన్స్ తో పాటు పెద్దయ్యాక వచ్చిన సీన్స్ బాగున్నాయి. శివాని, సుహాస్ మధ్య వచ్చిన సీన్స్ కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. ముఖ్యంగా సుదర్శన్,కృష్ణ,బలవంత్  మధ్య వచ్చిన కామెడి పంచ్ డైలాగ్స్ సూపర్. బలవంత్ బిజినెస్ సీన్స్ పర్లేదు. ఈ కథకి పారలల్ గా పీవీపీ, దుర్గ తో  సీన్స్ వచ్చి నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ కలిగింది.ప్రకృతి వైద్యుడుగా వెన్నెల కిషోర్ ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్ కి చాలా ప్లస్. పివిపి ఫాదర్ గా బాబు మోహన్ సైలెంట్ యాక్టింగ్ ఓకే. బాబూమోహన్ పైనే వచ్చిన  ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది.

సెకండాఫ్ మాత్రం  స్లో అయింది. ఫ్లో దెబ్బ తినలేదు కానీ ఫస్టాఫ్ ఇచ్చిన కిక్ అయితే లేదు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ లా  బలవంత్  చెప్పిన డైలాగ్స్  సూపర్. వెన్నెల కోశోర్, చెంపల పెళ్లి సంబంధం ఒకే చెయ్యడానికి బలవంత్ బిజినెస్ కి సంబంధించిన వాళ్ళందరూ రావడం, ఆ సందర్భంగా వచ్చిన సీన్స్ వర్క్ అవుట్ కాలేదు. క్లైమాక్స్ తో పాటు బలవంత్ ఫ్లాష్ బ్యాక్ సీన్ మెప్పిస్తుంది..

నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు 

సుహాస్ మరోసారి తన నాచురల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్  అదుర్స్. హీరోగా తన జర్నీకి ఇప్పట్లో బ్రేక్ ఉండదని మరోసారి నిరూపించుకునేలా తన పెర్ ఫార్మ్ ఉంది.శివాని నాగారం కూడా తన క్యారక్టర్ పరిధి మేరకు ఈజీ యాక్టింగ్ తో మెప్పించింది. నరేష్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. మరోసారి తన నట విశ్వ రూపంతో హే బలవంత్ కి అతి పెద్ద ప్లస్ గా నిలిచాడు. సదరు క్యారక్టర్ లో నరేష్ గారు కాకుండా ఇంకొకరు ఆ స్థాయి పెర్ఫార్మ్ ఇవ్వడం జరగని పని. ముఖ్యంగా కొడుకు తనపై ద్వేషం చూపిస్తుంటే టైట్ క్లోజ్ షాట్ లో నరేష్ గారు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ సూపర్.   అజయ్ ఘోష్ పెర్ ఫార్మ్ లో మెరుపులు లేకపోయినా పర్లేదు. వెన్నెల కిషోర్ మరో సారి తన స్టైల్ ఆఫ్ కామెడీ తో మెప్పించాడు. సుహాస్ ఫ్రెండ్ గా చేసిన సుదర్శన్  బాగానే పెర్ఫార్మ్ చేసినా రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్ తో ఎంటర్ టైన్ మెంట్ ని పండించినట్టుగా ఉంది.

ఆ ప్లేస్ లో సత్య లాంటి ఆర్టిస్ట్ అయితే బాగుందేమో. చెంప గా చేసిన స్రవంతి మెప్పించింది. మరిన్ని సినిమాల్లో తనకి అవకాశాలు రావడం గ్యారంటీ. హర్షవర్ధన్ మరో సారి తాను ఎంత వాల్యుబుల్ నటుడో మరో సారి చాటి చెప్పాడు. ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు సూపర్. గోపి(Gopi Atchara)దర్శకుడిగా భారీగానే సక్సెస్ అయ్యాడు. రచయితగా మాత్రం తాను ఎంచుకున్న కథకి సరైన కథనాన్ని,రీజన్స్ ని ఎంచుకోడంలో తడబడ్డాడు. డైలాగ్ రైటర్ విషయానికి వస్తే తన డైలాగ్స్ తో నవ్వులు పూయించాడు. ఎడిటింగ్ బాగుంది



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

చివరిగా చెప్పాలంటే రిస్కీ ప్లాట్ ని ఎంతో గట్స్ తో తెరకెక్కించారు. ఈ విషయంలో నిర్మాత, దర్శకుడు, హీరోని అభినందించాలి.


బలాలు
1 . ఊహించని కథ
2 . ఎంటర్ టైన్మెంట్ 
3 . డైలాగ్స్ 
4 . నరేష్ పెర్ ఫార్మెన్స్ 
5 . ఫస్ట్ హాఫ్ లో వచ్చే వెన్నెల కిషోర్ ఎపిసోడ్ 
6 . ఇంటర్ వెల్ ట్విస్ట్ 
7 .సుహాస్ 

బలహీనతలు 
1 .సెకండ్ హాఫ్ స్లో గా వెళ్లడం 
2 .  క్యారెక్టర్స్ కి సరైన రీజన్ ఇవ్వకపోవడం  
3 .సాంగ్స్ 

 

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.