Home » Movie Reviews » కపుల్ ఫ్రెండ్లీ



Facebook Twitter Google


సినిమా పేరు: కపుల్ ఫ్రెండ్లీ
న‌టీన‌టులు: సంతోష్ శోభన్, మానస వారణాసి, రాజీవ్ కనకాల, గోపరాజు రమణ, యోగిబాబు తదితరులు  
సినిమాటోగ్ర‌ఫీ: దినేష్ పురుషోత్తమన్
ఎడిట‌ర్‌: గణేష్ శివ 
మ్యూజిక్: ఆదిత్య రవీంద్రన్ 
నిర్మాత‌: అజయ్ కుమార్ రాజు 
రచన, దర్శకత్వం:అశ్విన్ చంద్రశేఖర్ 
బ్యానర్ : యువి క్రియేషన్స్ 
రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 14 , 2026 


సంతోష్ శోభన్(Santhosh Soban)మానస వారణాసి(Manasa varanasi)వాలెంటైన్స్  డే కానుకగా ఈ రోజు 'కపుల్ ఫ్రెండ్లీ'(couple Freindly)అనే మూవీతో థియేటర్స్ లోకి వచ్చారు. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా కావడం, ప్రచార చిత్రాలతో మంచి క్రేజ్ ఏర్పడటంతో నిన్న ప్రీమియర్స్ కూడా ప్రదర్శించడం జరిగింది.. మరి కపుల్ ఫ్రెండ్లీ మెప్పించిందా లేదా చూద్దాం.

 

కథ

నెల్లూరు కి చెందిన శివ(సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైన్ కోర్స్ పూర్తి చేసి ఉద్యోగం కోసం చెన్నై చేరతాడు. చిత్తూరుకి చెందిన చైత్ర (మానస వారణాసి) ఉద్యోగం పని మీదే చెన్నైలోనే ఉంటుంటుంది.లేడీస్ హాస్టల్ తన స్టే. ఆ తర్వాత శివతో కలిసి శివ ఉన్న ఇంట్లోనే ఉంటుంది. మైండ్ మెచ్యూరిటీ పరంగా ఇద్దరు ఎంతో ఉన్నతమైన వ్యక్తులు. ఒక రోజు శారీరకంగా కలుస్తారు.ఆ తర్వాత ఇద్దరి బిహేవియర్ లో చేంజ్ వస్తుంది. అదే టైమ్ లో చైత్ర గురించి ఒక భయంకరమైన నిజం శివ కి తెలుస్తుంది. శివ కి చైత్ర గురించి తెలిసిన నిజం ఏంటి? నిజం తెలిసిన శివ ఏం చేశాడు?ఆ ఇద్దరికి ఎలా పరిచయం జరిగింది? అసలు ఆ ఇద్దరు మంచి వాళ్ళా చెడ్డ వాళ్ళా? చివరకి వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ముగిసాయి అనేదే కపుల్ ఫ్రెండ్లీ.



ఎనాలసిస్ :

ఖచ్చితంగా మంచి కథే. పెళ్లి కాని ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన తప్పుగా అనుకోకూడదు. ఒక వేళ ఆ ఇద్దరు తప్పు చేసినా అది స్వచమైన ప్రేమకి నిదర్శనం. శారీరక సుఖం కంటే ప్రేమ గొప్పది అని కూడా ఈ కథ  చెప్పింది. చివరకి  శివ, చైత్ర క్యారెక్టర్స్ ముగిసిన విధానం కన్నీళ్లు కూడా తెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే శివ, చైత్ర క్యారెక్టర్స్ మధ్య పరిచయం సందర్భంగా వచ్చిన సీన్స్  బాగున్నాయి. కానీ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండటానికి రీజన్ మాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఒక కారణంతో హాస్టల్ నుంచి బయటకొచ్చిన చైత్రకి మళ్ళీ చెన్నై లాంటి మహానగరంలో ఉండటానికి హాస్టల్ దొరకదా? పైగా ఎన్నో హాస్టల్స్ తిరగడం కూడా చూపించారు.కథ మొత్తానికి ఈ ఇద్దరు కలిసి ఉండటమే ముఖ్యం కాబట్టి వేరేలా ప్లాన్ చేసి ఉండాల్సింది.

 

లైఫ్ లో శివ ఎదుగుదలకి చైత్ర చెప్పిన టిప్స్ తో పాటు సీన్స్ మొత్తం ఫ్రెష్ నెస్ తో ఉన్నాయి. మధ్య మధ్యలో రివర్స్ స్క్రీన్ ప్లే తో కేరళలో వచ్చిన సీన్స్ క్యూరియాసిటీ కలిగించాయి. శివ, చైత్ర వాళ్ళ ఫ్యామిలీ సీన్స్ రొటీన్. ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించిందే. సెకండ్ హాఫ్ ని సాగదీసినట్టుగా అనిపించింది. శివ, చైత్ర మధ్య ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ని ఇవ్వలేకపోయారు. చైత్రకి తన ప్రాబ్లమ్ తెలుసు కాబట్టి శివ బాగుండాలనే లక్ష్యంతో  యాంటీ గా మారవలసింది. తద్వారా శివ తో పాటు చైత్ర లో ఎమోషనల్ వర్క్ అవుట్ అయ్యేది. ఆ దిశగా వెళ్లకుండా చైత్ర క్యారక్టర్ లో కన్ఫ్యూజ్ ని క్రియేట్ చేసారు. హాస్పిటల్ సీన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా వర్క్ అవుట్ కాలేదు.

 

నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు 


శివ గా సంతోష్ శోభన్ తన పెర్ ఫార్మెన్స్ తో బాగానే  మెప్పించాడు. కాకపోతే కథ మొత్తం  ఒకే వేరియేషన్ లో సాగడంతో యాక్టింగ్ లో మెరుపులు చూపించడానికి అవకాశం రాలేదు. చైత్ర గా మానస వారణాసి పర్ఫెక్ట్ గా సూటవ్వడంతో పాటు సదరు క్యారక్టర్ కి జీవాన్ని పోసింది. రాజీవ్ కనకాల, గోపరాజు రమణ, యోగిబాబు  తమ క్యారెక్టర్ల పరిధి మేరకు సెటిల్డ్ పెర్ ఫార్మ్ తో మెప్పించారు. అశ్విన్ చంద్రశేఖర్(Ashwin Chandrasekhar)దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు.  కథకుడుగా శివ, చైత్ర క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేయలేకపోయాడని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు, ఫొటోగ్రఫీ సూపర్. ఈ రెండే ప్రధాన హైలెట్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆదిత్య రవీంద్రన్ మ్యూజిక్ నుంచి వచ్చిన సాంగ్స్ మనసుని హత్తుకోవడంలో విఫలమయ్యాయి.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఓవర్ ఆల్ గా చూసుకుంటే మంచి కథ. సంతోష్ శోభన్, మానస వారణాసి తమ పెర్ ఫార్మెన్స్ తో మెప్పించారు. కాకపోతే సెకండ్ హాఫ్ ని సాగతీయ్యడంతో పాటు ఫీల్ ని సృష్టించడానికి క్యారెక్టర్స్ ని ఎండ్ చేసినట్టుగా ఉంది.


బలాలు
 
1 సంతోష్ శోభన్, మానస వారణాసి పెర్ ఫార్మెన్స్ 
2 . ఫస్ట్ హాఫ్ 
3 .చెన్నై,కేరళ లో కథ జరగడం 
4 ఫొటోగ్రఫీ 
5 .టోటల్ కథ
6 .ఎడిటింగ్ 


బలహీనతలు 

1 .మానస, సంతోష్ శోభన్ కలిసి ఉండటానికి సరైన రీజన్ సెట్ కాకపోవడం 
2 . స్లో గా నడిచిన సెకండ్ హాఫ్ 
3 . మానస క్యారక్టర్ ని ఎండ్ చేసిన విధానం 
4 . డైలాగ్స్ 
5 .సరైన సాంగ్స్ లేకపోవడం 
6 .ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్

 

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.