![]() |
![]() |
.jpg)
తమిళ్ స్టార్ హీరో 'విజయ్' నటించిన భారీ బడ్జెట్ మూవీ పులి.. బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. మొదటివారంలోనే పులి 71 కోట్లు వసూలు చేసిందంటూ నిర్మాతలు ప్రకటించారు. అయితే నిజంగానే అంత పెద్ద వసూళ్లు తెచ్చిందని అనుకున్నా పులి సినిమా వల్ల దాదాపు 30 కోట్లు పైగానే బయ్యర్లు నష్టపోవాల్సి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 71 కోట్లు గ్రాస్ అనుకుంటే షేర్ వసూళ్లు ఇంచుమించు 50కోట్లు ఉంటాయి. ఆ తర్వాతి వారం షేర్ మరో 20 కోట్లు వసూలైంది అనుకున్నా .. పులి టోటల్ రన్ లో 70 కోట్లు మించి వసూలు చేసి ఉండదు. అయితే ఈ సినిమాని 105 కోట్లకు బయ్యర్లకు అమ్మేశారు. కాబట్టి ఆ మిగిలిన 30 కోట్లు నష్టం కిందే లెక్క.
![]() |
![]() |