Home  »  Gossip  »  సంచలన వార్త: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. వద్దంటున్న టాప్ డైరెక్టర్!

Updated : Aug 11, 2026

 


హీరో, దర్శకుడు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని.  కానీ ఇద్దరి దర్మం మాత్రం అభిమానులని, ప్రేక్షకులని అలరించి ఆ ఇద్దర్ని నమ్ముకున్న నిర్మాత ముఖంలో,  సినీ కళామతల్లి మొహాల్లో నవ్వులు పూయించడం. కానీ ఇప్పుడు ఆ  ఇద్దరకీ సంబంధించిన గాసిప్ ఒకటి తెలుగు ఫిల్మ్‌ సర్కిల్స్ లో  తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 


సాధారణంగా టాలీవుడ్‌లో ఒక మోస్ట్ క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందంటే చాలు, అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. అలాంటిది ఏకంగా ఇండియన్ సినీ పరిశ్రమలోనే అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఒకటిగా ముద్రపడిన ఒక స్టార్ హీరో, మరో అగ్ర దర్శకుడి మధ్య ఇప్పుడు సీక్వెల్ విషమై తీవ్రమైన అంతర్గత విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ మరియు భారీ అంచనాల నడుమ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్ నుంచి బయటకు వచ్చిన ఒక తాజా వార్త సినిమా వర్గాలతో పాటు అభిమానులను సైతం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.అసలు విషయం ఏమిటంటే, ఈ భారీ చిత్రంలో నటిస్తున్న సదరు స్టార్ హీరో ఈ కథకు భారీ స్కోప్ ఉందని భావించి, దీనిని కేవలం ఒక్క భాగంతో ముగించకుండా "పార్ట్-2" కూడా నిర్మిస్తే బాగుంటుందని గట్టిగా పట్టుబడుతున్నారట. ఒకవేళ సీక్వెల్ చేస్తే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయవచ్చని హీరో భావిస్తున్నట్లు సమాచారం. కానీ సదరు స్టార్ డైరెక్టర్ మాత్రం హీరో ప్రతిపాదనకు ఏమాత్రం సుముఖంగా లేరని తెలుస్తోంది. కథను రెండు భాగాలుగా విస్తరిస్తే దాని ఆత్మ దెబ్బతింటుందని, సినిమా ల్యాగ్ అయి ప్రేక్షకులకు విసుగు తెప్పించే అవకాశం ఉందని దర్శకుడు అభిప్రాయపడుతున్నారట. సింగిల్ పార్ట్‌లోనే కథలోని అసలైన భావోద్వేగాలు, ఉత్కంఠని  పకడ్బందీగా అందించవచ్చని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.


Also read: వైరల్: పూరి జగన్నాధ్ కూతురు కలలోకి వచ్చిన ఆ దేవుడు.. పూర్తిగా లీనమైపోదంట

ఈ అభిప్రాయ భేదాల వల్ల ప్రస్తుతం హీరో మరియు దర్శకుడి మధ్య తీవ్రమైన కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సీక్వెల్ నిర్ణయానికే పరిమితం కాకుండా, సెట్స్‌లో సీన్స్ తీసే విధానంలో కూడా విభేదాలు బయటపడుతున్నాయట. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ సమయంలో హీరో సూచించే మార్పులు, చేర్పులకు డైరెక్టర్ విముఖత చూపుతున్నారని సమాచారం.  దీంతో వీరిద్దరి మధ్య ఈగో వార్ నడుస్తోందని, చిత్రీకరణ వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారుతోందని టాలీవుడ్ ఇన్‌సైడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా సీక్వెల్స్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి పెద్ద సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించి వందల కోట్ల బిజినెస్ చేయడం కామన్ ట్రెండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో సదరు స్టార్ హీరో కూడా తన ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా చేయాలని కోరడంలో పెద్దగా వింతేమీ లేదని కొందరు వాదిస్తున్నారు. కానీ, డైరెక్టర్ మాత్రం కంటెంట్ నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తూ పార్ట్-2 ప్రతిపాదనని  తిరస్కరిస్తుండటం విశేషం. మరి చివరకి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే  ఎవరకి వాళ్ళు నియంతగా భావించుకుంటారు. కానీ   అన్నిటికంటే పెద్ద  నియంత  కాలమే.. కాబట్టి వెయిట్ చేద్దాం.

Hero, Director, Tollywood






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.