![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తన 64వ చిత్రం 'డేర్‌డెవిల్'ను రీసెంట్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో అజిత్‌కు సాలిడ్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈసారి కేవలం తమిళ మార్కెట్ మాత్రమే కాకుండా, పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేశారు.
ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఒక సంచలన మల్టీస్టారర్ కాంబినేషన్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు స్టార్స్ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే.. థియేటర్లు షేక్ అవ్వడం గ్యారెంటీ. త్వరలోనే ఈ మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ గురించి క్లారిటీ రానుంది.
అజిత్ కుమార్ సతీమణి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ షాలిని తన కొత్త బ్యానర్ 'బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్'పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Ajith Kumar, Dare Devil, Venkatesh, Mohanlal
![]() |
![]() |