![]() |
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ కాంబినేషన్‌లో ఓ హై టెక్నికల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ చేయబోయే సినిమా గురించి ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల తన అమెరికా పర్యటనను ముగించుకొని హైదరాబాద్ వచ్చిన బన్నీని తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కలిశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా జరిగిన బన్నీ, లోకేష్ మీటింగ్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వీరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే ప్రచారానికి బలం చేకూరింది. అదే నిజమైతే అట్లీ సినిమా పూర్తి కాగానే లోకేష్ ప్రాజెక్ట్‌కి ముహూర్తం నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. దాంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో బన్నీ చేయబోయే సినిమాపై ఒక క్రేజీ అప్‌డేట్ బయటికి వచ్చింది. ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చాయి. మూడో సారి వీరిద్దరూ కలిసి సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే మధ్యలో ఎన్టీఆర్ పేరు వినిపించింది. తాజా సమాచారం మేరకు ఈ ప్రాజెక్ట్ మళ్లీ బన్నీ దగ్గరికే వచ్చిందట. పురాణాల ఆధారంగా కార్తికేయుడి కథతో త్రివిక్రమ్ ఒక భారీ సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేశారట. అయితే లోకేష్, త్రివిక్రమ్.. ఈ ఇద్దరిలో ఎవరి సినిమా మొదట స్టార్ట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.
![]() |