పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)ప్రస్తుతం ది రాజా సాబ్(the raja saab)షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.హర్రర్ కామెడీ గా తెరకెక్కనున్న ఈ మూవీ, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ పది న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.రీసెంట్ గా జరిగిన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఒక మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది.ఓల్డ్ ఏజ్ లుక్ లో కనపడిన ప్రభాస్ రాజాసాబ్ పై అందరిలోను అంచనాలు రెట్టింపు చేసాడని చెప్పవచ్చు.
తాజాగా ప్రభాస్ ఒక భారీ మల్టీస్టారర్ కి నో చెప్పినట్లుగా ఫిలిం సర్కిల్స్ లో ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే అది తెలుగు సినిమా కాదు. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ హిందీలో ఒక సినిమా చేయాల్సి ఉంది.అగ్ర నిర్మాతలు మైత్రీ మూవీస్ ఆ సినిమాకి నిర్మాతలు. ఈ మేరకు చాలా రోజుల క్రితమే ఆ ముగ్గురి కాంబోలో మూవీ రాబోతుందని, ప్రభాస్ ఫస్ట్ టైం చెయ్యబోయే డైరెక్ట్ హిందీ మూవీ కూడా అదేనని గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( shah rukh khan)మెయిన్ హీరోగా చేస్తాడని,సెకండ్ లీడ్ హీరోగా ప్రభాస్ చెయ్యాలని దర్శకుడు చెప్పాడని, అందుకే ప్రభాస్ నో చెప్పాడని అంటున్నారు.తాను ఇప్పట్లో మల్టీస్టారర్ చిత్రానికి రెడీగా లేనని చాలా స్పష్టంగా ప్రభాస్ తేల్చి చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడినట్లు బి టౌన్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రభాస్ చేతిలో అయితే రాజాసాబ్ కాకుండా మరో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీని ఇటీవలే ప్రారంభించాడు. ఆ మూవీకి ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, కొన్ని రోజుల క్రితమే షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే సలార్ పార్ట్ 2 కూడా అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది.ఈ విషయాన్నీ ప్రశాంత్ నీలే స్వయంగా చెప్పాడు. సందీప్ రెడ్డి వంగ తో చేస్తున్న మూవీ స్పిరిట్ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా చెయ్యబోతున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.