![]() |
![]() |

ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ సోదరుడు, నిర్మాత చంద్రహాసన్ లండన్‌లో కన్నుమూశారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చంద్రహాసన్ తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జనవరి 7న చంద్రహాసన్ భార్య గీతామణి మరణించినప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు..దీంతో ప్రశాంతత కోసం బ్రిటన్ వెళ్లి అక్కడ కూతురు అనుహాసన్ వద్దే ఉంటున్నారు.
అన్నయ్య మరణవార్తతో హుటాహుటిన లండన్ వెళ్లారు కమల్ హాసన్. తాను ఎంతగానో గౌరవించే సోదరుని మరణం కమల్‌ను ఎంతగానో కలచివేసింది. ఇదే సమయంలో చంద్రహాసన్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు కమల్. ఎన్నో గొప్ప సదుపాయాలు ఉన్న బ్రిటన్‌లో చికిత్స చేయించినప్పుడు కుటుంబసభ్యులు నిశ్చింతగా ఉండొచ్చు..పైగా అన్నయ్యకి వచ్చింది మైనర్ ఎటాక్..అటువంటప్పుడు ఆయన ఎలా మరణించారు..? అన్నింటికి మించి మైనర్ ఎటాక్కే పోస్ట్‌మార్టం చేస్తారా అంటూ సందేహన్ని వ్యక్తం చేశారు కమల్. అయితే రిపోర్టులు వచ్చే వరకూ దీని గురించి ఏమి మాట్లాడనన్నారు.
![]() |
![]() |