Home  »  Gossip  »  'రుద్రమదేవి'ని చూసే మోక్షం ఎప్పుడూ?

Updated : Aug 21, 2015

గుణశేఖర్ తెరకెక్కించిన భారీ డ్రీమ్ ప్రాజెక్ట్ రుద్రమదేవికి ఆటంకాలు ఇంకా తప్పినట్లు కనబడడం లేదు. గత కొన్ని నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ, ఎట్టకేలకు ఓ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోగలిగింది. కానీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ కూడా సినిమా రిలీజ్ అవ్వడం కష్టమేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

బాహుబలి, శ్రీమంతుడు తరువాత తెలుగు సినిమా మార్కెట్ బాగా పుంజుకోవడంతో 'రుద్రమదేవి'కి  మంచి రోజులొచ్చాయని, సెప్టెంబర్ 4 విడుదల కానున్న ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖయామని అందరూ భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయినట్టు లేటెస్ట్ టాక్.

సిజి వర్క్ ఇంకా పెండింగ్ లో వుండడ౦తో ఈ సినిమాను అక్టోబర్ 2న దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ డేట్ క్యాష్ చేసుకోవాలని మంచు విష్ణు, నాని పోటీ పడుతున్నారట. ఒకవేళ రుద్రమదేవి వస్తే ఆగాలని, లేకుంటే రావాలని డిసైడ్ అయ్యరాట. మరి తెలుగు ప్రేక్షకులకు రుద్రమదేవిని చూసే మోక్షం ఎప్పుడూ కలుగుతుందో? 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.