![]() |

టాలీవుడ్ లో ఒక క్రేజీ అండ్ మైండ్ బ్లోయింగ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సిద్ధమవుతోంది. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), ఎంటర్టైన్మెంట్ కింగ్ శ్రీ విష్ణు (Sree Vishnu) కలిసి ఒకే స్క్రీన్‌పై సందడి చేయనున్నారు. ఈ ఇద్దరు ఎనర్జిటిక్ హీరోల కలయికలో రాబోతున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కించనున్నారు. 'రాజా రాజ చోర' వంటి వైవిధ్యమైన సినిమాలతో మెప్పించిన హసిత్ గోలి, ఈసారి ఈ ఇద్దరు హీరోల బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఒక అదిరిపోయే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోల కాంబో అనౌన్స్మెంట్ రాక ముందే ఇండస్ట్రీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ పట్ల విపరీతమైన ఆసక్తి నెలకొంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారు. దిల్ రాజు నిర్మాణ విలువలు, రవితేజ మాస్ అప్పీల్, శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ అన్నీ కలిపి ఈ సినిమాను ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్‌గా మార్చబోతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్ తో పాటు నటీనటుల ఎంపిక, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. పక్కా ప్రణాళికతో మేకర్స్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు పూజా కార్యక్రమాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ సర్కిల్స్ నుండి ఒక క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. చిత్రబృందం ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సంక్రాంతి రేసులో నిలపాలని ఫిక్స్ అయింది. ఈ మల్టీస్టారర్ మూవీని సంక్రాంతి 2027 కానుకగా థియేటర్లలో విడుదల చేయడమే లక్ష్యంగా మేకర్స్ వర్క్ ప్లాన్ సెట్ చేసుకున్నారు.
సాధారణంగానే టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ అంటే సినిమాల పండగ. అలాంటిది రవితేజ, శ్రీ విష్ణు కాంబినేషన్ లో ఎంటర్టైనర్ అంటే థియేటర్ల వద్ద హంగామా ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పక్కా కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునే విధంగా దర్శకుడు హసిత్ గోలి ఈ కథను మలిచారని, దిల్ రాజు సైతం ఈ ప్రాజెక్ట్ పై ఎంతో నమ్మకంగా ఉన్నారని టాక్.
![]() |