Home  »  Gossip  »  ‘పెద్ది’ డైరెక్టర్ బుచ్చిబాబుతో మహేష్ బాబు మూవీ.. అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్!

Updated : Jun 5, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) దర్శకత్వంలో రూపొందిన 'పెద్ది' (Peddi) సినిమా రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్, రామ్ చరణ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో 'పెద్ది' చిత్రం థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా అందించిన భారీ విజయంతో దర్శకుడు బుచ్చిబాబు పేరు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో మారుమోగిపోతోంది. చరణ్ కు ఒక బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తన తదుపరి ప్రాజెక్టును ఎవరితో చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ విపరీతంగా పెరిగిపోయింది.

ఇదే తరుణంలో టాలీవుడ్ వర్గాల నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. 'పెద్ది' సినిమా కంప్లీట్ అయిన తర్వాత బుచ్చిబాబు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో ఒక భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారనే గుసగుసలు ఆ మధ్య గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు ఆ ప్రచారం కాస్తా నిజమయ్యేలా కనిపిస్తోందని ఇండస్ట్రీ టాక్. మహేష్ బాబు ఇమేజ్‌కు సరిపోయేలా, ఆయన అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా బుచ్చిబాబు ఒక అదిరిపోయే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని సమాచారం. ఇప్పటికే ఈ కథకు సంబంధించిన బేసిక్ లైన్ కూడా రెడీగా వుందని, అది వినడానికి ఎంతో ఆసక్తికరంగా ఉందని ఫిలిం సర్కిల్స్ లో గట్టిగా మాట్లాడుకుంటున్నారు. రామ్ చరణ్ ను సరికొత్త కోణంలో చూపించిన బుచ్చిబాబు, ఇప్పుడు మహేష్ బాబును కూడా మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో ప్రజెంట్ చేయడానికి పక్కా ప్లాన్ తో ఉన్నారట.

మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత బుచ్చిబాబుతో సినిమా చేసే అవకాశముందని తెలుస్తోంది. బుచ్చిబాబు చెప్పిన స్టోరీ లైన్ పట్ల మహేష్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్టు కుదిరితే, ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన చాలా త్వరలోనే వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఆగస్టు 9న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని టాలీవుడ్ లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 9న ఈ బిగ్ అనౌన్స్ మెంట్ వస్తే మాత్రం సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయమనడంలో సందేహం లేదు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.