![]() |
![]() |

- 'వారణాసి' తర్వాత రాజమౌళి మూవీ ఏ హీరోతో?
- ఎన్టీఆర్, రామ్ చరణ్ వైపే జక్కన్న మొగ్గు చూపుతున్నాడా?
- మరో మల్టీస్టారర్ చేసే సాహసం చేస్తాడా?
- ఆ రెండు స్టోరీలతో దర్శకధీరుడు వేస్తున్న స్కెచ్ ఏంటి?
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' (Varanasi) సినిమా చేస్తున్నారు. ఈ భారీ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుంది అనే చర్చ మొదలైపోయింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'వారణాసి' సినిమా తర్వాత రాజమౌళి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం 'ఆర్ఆర్ఆర్'తో ఈ ఇద్దరు హీరోలకు గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. అలాగే, రాజమౌళితో వారికున్న బాండింగ్ కూడా చాలా ప్రత్యేకమైనది.
రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ కోసం విడివిడిగా రెండు పవర్‌ఫుల్ కథలను సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఏ కథ ముందుగా కొలిక్కి వస్తే.. ఆ హీరోతో సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు.
గతంలో వీరిద్దరితో కలిసి మల్టీస్టారర్ చేసిన రాజమౌళి.. ఈసారి మాత్రం విడివిడిగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ కోసం ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఒక హై-వోల్టేజ్ ఎమోషనల్ డ్రామాను సిద్ధం చేస్తున్నట్లు టాక్. అలాగే రామ్ చరణ్ స్టైలిష్ లుక్, యాక్షన్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మరో భారీ కథపై కసరత్తు జరుగుతోందట.
ఈ ఇద్దరు హీరోలలో ఎవరితో ముందుగా సినిమా సెట్స్ పైకి వెళ్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బహుశా రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి ఈ రెండు స్క్రిప్టులపై సమాంతరంగా చర్చలు జరిపే ఛాన్స్ ఉంది.
అయితే ప్రస్తుతానికి రాజమౌళి పూర్తి దృష్టి మహేష్ బాబు సినిమాపైనే ఉంది. 'వారణాసి' మూవీ ఇండియన్ సినిమాలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది పూర్తి కాగానే తన తదుపరి హీరో ఎవరనే దానిపై జక్కన్న అధికారికంగా స్పందించే అవకాశం ఉంది.
![]() |
![]() |