![]() |

2016లో 'నిర్మలా కాన్వెంట్'తో టీనేజ్ లో ప్రేక్షకులను పలకరించిన శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan Meka).. 2021లో 'పెళ్లి సందడి'తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అందులో తన లుక్స్, డ్యాన్స్ లతో ఆకట్టుకున్నప్పటికీ.. రావాల్సినంత క్రెడిట్ రాలేదు. ఈ క్రమంలోనే కాస్త గ్యాప్ తీసుకొని తాజాగా 'ఛాంపియన్'(Champion)గా థియేటర్లలో అడుగుపెట్టాడు. ఈ సినిమా రోషన్ కి మంచి పేరు తీసుకు రావడమే కాకుండా, పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది.
'ఛాంపియన్' విడుదలకు ముందు నుంచే రోషన్ తో సినిమాలు చేయడానికి పలువురు నిర్మాతలు, దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. సితార బ్యానర్ ఓ సినిమాని ప్లాన్ చేస్తోంది. 'ఛాంపియన్'ని నిర్మించిన స్వప్న సినిమా కూడా మరో మూవీ చేసే సన్నాహాల్లో ఉంది. అలాగే శైలేష్ కొలను, ఇంద్రగంటి మోహనకృష్ణ వంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో సీనియర్ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ఆయనే గౌతమ్ వాసుదేవ్ మీనన్. (Gautham Vasudev Menon)
కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో గౌతమ్ మీనన్ ఒకరు. తెలుగులోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. తెలుగులో ఘర్షణ, ఏ మాయ చేసావే వంటి సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. చివరిగా తెలుగులో 2016లో వచ్చిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలుగు మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోషన్, గౌతమ్ మీనన్ మధ్య కథా చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే 'ఛాంపియన్' తర్వాత రోషన్ నుండి రాబోయే సినిమా ఇదేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
![]() |