![]() |
![]() |

ప్రభాస్ బాటలో రామ్
బాహుబలి నిర్మాతల క్రేజీ ప్రాజెక్ట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 2026 సంక్రాంతికి 'ది రాజా సాబ్'(The Raja Saab)తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ ఫిల్మ్ గా ఇది రూపొందుతోంది. అయితే ఇప్పుడిదే బాటలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పయనించబోతున్నట్లు తెలుస్తోంది.
రామ్ రీసెంట్ గా 'ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka)తో థియేటర్లలో అడుగుపెట్టాడు. దీని తర్వాత రామ్ చేయబోయే సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇటీవల సముద్రఖని దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశముందని వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరో ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.
రామ్ తన తదుపరి సినిమాని నూతన దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో చేయనున్నాడట. హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని బాహుబలిని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించనుందని సమాచారం.
![]() |
![]() |