![]() |
![]() |

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan) అప్ కమింగ్ మూవీ 'ఓజి'(OG) కోసం అభిమానులతో పాటు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న 'ఓజి' లో 'ఓజాస్ గంభీర్' అనే గ్యాంగ్ స్టర్ రోల్ లో పవన్ తన మార్క్ మాయాజాలాన్ని మరోమారు ప్రదర్శించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో పాటు దర్శకుడు 'సుజిత్'(Sujeeth) పలు ఇంటర్వూస్ లో 'ఓజి' గురించి చెప్తున్న విషయాలతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. విజయదశమి(Vijaya Dasami) కానుకగా సెప్టెంబర్ 25 న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకి సిద్ధమవుతుండగా, పవన్ సరసన ప్రియాంక మోహన్(Priyanka MOhan) జత కడుతుంది. ఇటీవల ఆమె క్యారక్టర్ కి సంబంధించిన లుక్ ని రివీల్ చేసారు. 'కణ్మణి' గా హోమ్లీ లుక్ లో ఉన్న ప్రియాంక లుక్ విశేషంగా ఆకర్షిస్తుంది.
ప్రముఖ తమిళ నటుడు 'అర్జున్ దాస్'(Arjun Das) ఓజిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya lekshmi)తో అర్జున్ దాస్ ప్రేమలో పడ్డాడనే రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలోను ఇలాంటి వార్తలే రావడంతో అర్జున్ దాస్ ఖండిస్తు.. ఐశ్వర్య, నేను మంచి స్నేహితులమని చెప్పుకొచ్చాడు. అయితే రీసెంట్ గా ఈ ఇద్దరు ప్రముఖ దర్శకుడు బాలాజీ మోహన్ తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ లో కలిసి చేస్తున్నారు. ఈ కారణంతోనే అర్జున్ దాస్ ప్రేమ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది.
లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ఖైదీ, మాస్టర్ చిత్రాలతో 'అర్జున్ దాస్' నటుడుగా ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఆక్సిజన్, బుట్టబొమ్మ వంటి పలు తెలుగు చిత్రాల్లో కూడా కనిపించిన అర్జున్ దాస్ 2012 లో సినీ రంగ ప్రవేశం చేసాడు.
ఇక మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన ఐశ్వర్య లక్ష్మి 2017 లో సినీ రంగ ప్రవేశం చేసి పలు భాషా చిత్రాల్లో చేస్తు దూసుకుపోతుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ హాసన్(Kamal Haasan), శింబు ల థగ్ లైఫ్ లో శింబు సోదరిగా నటించి మంచి పేరు సంపాదించిన ఐశ్వర్య ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)తో సంబరాల యేటి గట్టు(Syg) అనే మూవీలో చేస్తుంది.

![]() |
![]() |