![]() |
![]() |

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం `లైగర్`తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది బాలీవుడ్ భామ అనన్యా పాండే. ఆగస్టు 25న ఈ పూరీ జగన్నాథ్ డైరెక్టోరియల్.. సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది.
ఇదిలా ఉంటే, `లైగర్` విడుదలయ్యే లోపే ఓ భారీ బడ్జెట్ మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుందట అనన్య. ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో విజనరీ కెప్టెన్ కొరటాల శివ ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ తీయబోతున్న సంగతి తెలిసిందే. `జనతా గ్యారేజ్` (2016) వంటి సంచలన చిత్రం తరువాత తారక్ - కొరటాల కాంబోలో రానున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ లో తారక్ సరసన ఓ హీరోయిన్ గా అనన్యా పాండేని ఎంపిక చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. కథ, పాత్ర, పారితోషికం నచ్చడంతో అనన్య కూడా ఆసక్తి చూపిస్తోందని టాక్. త్వరలోనే `ఎన్టీఆర్ 30`లో అనన్యా పాండే ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. తారక్, అనన్య ఫ్రెష్ కాంబినేషన్ వార్తలకే పరిమితమవుతుందో లేదంటే కార్యరూపం దాల్చుతుందో చూడాలి.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న `ఎన్టీఆర్ 30`కి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందిస్తున్నాడు.
![]() |
![]() |