![]() |
![]() |

'ప్రేమకథ' అనే మూవీతో సినీరంగ ప్రవేశం చేసిన సుమంత్ అక్కినేని(Sumanth Akkineni)ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటిస్తు అభిమానులతో పాటుప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు. 2004లో 'తొలిప్రేమ' మూవీ ఫేమ్ కీర్తిరెడ్డి(Keerthi Reddy)ని సుమంత్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు సంవత్సరాలకే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
ఇన్ని సంవత్సరాల తర్వాత సుమంత్ రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడని, ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడనే రూమర్స్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా సదరు హీరోయిన్, సుమంత్ ప్రేమలో ఉన్నారని, వీరి ప్రేమకి ఇరు వైపుల పెద్దలు అంగీకారం కూడా తెలిపారని అంటున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు హీరోయిన్ ఎవరై ఉంటారని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
యువకుడు,పెళ్లి సంబంధం, స్నేహం అంటే ఇదేరా, సత్యం, ధన 51 ,మహానంది, గోదావరి, చిన్నోడు, మధుమాసం,పౌరుడు, బోణీ, గోల్కొండ హైస్కూల్, నరుడాడో నరుడా, మళ్ళీరావా, సుబ్రమణ్యపురం, ఇదం జగత్ వంటి పలు విభిన్నమైన చిత్రాలు సుమంత్ నుంచి వచ్చాయి. ఎన్టీఆర్(Ntr)జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానాయకుడు, కథానాయకుడు చిత్రాల్లో తన తాత ఏఎన్ఆర్ క్యారక్టర్ లో కనపడి అత్యద్భుతంగా నటించాడు.
![]() |
![]() |