![]() |
![]() |

75 ఏళ్ళ వయసులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆగస్టు 14న 'కూలీ'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. అలాగే 'జైలర్-2' చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. శివ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా.. టాలీవుడ్ కి చెందిన బ్యానర్ లో రూపొందనుందని సమాచారం.
తెలుగులో 'శౌర్యం', 'దరువు' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శివ.. తమిళ్ లో అజిత్ తో చేసిన 'వీరం', 'వేదాళం', 'వివేగం', 'విశ్వాసం' సినిమాలతో మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు పొందాడు. ఆ తర్వాత రజినీకాంత్ తో అన్నాత్తే(పెద్దన్న) చేయగా, అది పరాజయం పాలైంది. ఇక గత చిత్రం 'కంగువా'ను సూర్యతో చేయగా.. అది డిజాస్టర్ అయింది. అయినప్పటికీ శివకి రజినీతో మరో సినిమా చేసే అవకాశం వచ్చిందట.
శివ తనకు ఫ్లాప్ ఇచ్చినప్పటికీ, ఆయనతో మరో సినిమా చేయడానికి రజినీకాంత్ రెడీ అవుతున్నట్లు వినికిడి. ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగినట్లు టాక్. ఈ ప్రాజెక్ట్ ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ నిర్మించనున్నారని తెలుస్తోంది.
![]() |
![]() |