![]() |
![]() |

భారతదేశంలో ఉన్న గొప్ప దర్శకులలో ఒకరిగా మణిరత్నంకి పేరుంది. ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించారు. మణిరత్నం దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని అప్పట్లో ఎందరో స్టార్స్ భావించేవారు. ఇప్పటికీ ఆయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి పలువురు హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ అవకాశం టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని వరించినట్లు తెలుస్తోంది.
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలతో టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ హీరోగా నవీన్ పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ఏకంగా మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఇది తెరకెక్కనుందట. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించనుందని వినికిడి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముంది.
మణిరత్నం త్వరలో 'థగ్ లైఫ్' మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. కమల్ హాసన్, శింబు, త్రిష ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 6న విడుదల కానుంది.
![]() |
![]() |