Home  »  Gossip  »  బోయపాటి నెక్స్ట్ మూవీ.. అల్లు అర్జున్ డేట్స్ ఇచ్చాడా?

Updated : Feb 10, 2026

 

బోయపాటి శ్రీను నెక్స్ట్ మూవీ ఎవరితో?
అల్లు అర్జున్ కి కథ వినిపించిన బోయపాటి?
'సరైనోడు' సీక్వెల్ కి బన్నీ సై అన్నాడా?

 

గతేడాది డిసెంబర్ లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా నటించిన 'అఖండ-2'తో ప్రేక్షకులను అలరించాడు బోయపాటి శ్రీను(Boyapati Srinu). ఆయన తన తదుపరి సినిమా ఏ హీరోతో చేస్తాడనే ఆసక్తి నెలకొంది.

 

నిజానికి 'అఖండ-2' విడుదల సమయంలో అల్లు అర్జున్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. గతంలో వీరి కాంబోలో 'సరైనోడు' సినిమా వచ్చింది. 'సరైనోడు-2' కోసం కానీ, లేదంటే ఆ తరహా ఒక మంచి యాక్షన్ సబ్జెక్టు కోసం కానీ.. వీరు మరోసారి చేతులు కలుపుతారని న్యూస్ వినిపించింది. (Allu Arjun)

 

తాజాగా అల్లు అర్జున్ ని కలిసి బోయపాటి కథ వినిపించినట్లు, ఆ కథకు బన్నీ ఇంప్రెస్ అయినట్లు మళ్ళీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం అనుమానమే. 

 

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఆ తరువాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే మరో ఇద్దరు ముగ్గురు దర్శకుల ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ తో సినిమా చేయాలంటే కనీసం రెండు మూడేళ్లు ఆగాలి. ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతకాలం ఎదురుచూడటం కష్టమే.

 

 

ఈ క్రమంలోనే మరో ఇద్దరు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు ఎవరో కాదు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, తెలుగు హీరో రానా దగ్గుబాటి. 'ధురంధర్'తో సంచలన విజయాన్ని అందుకున్న రణ్‌వీర్.. త్వరలో 'ధురంధర్-2'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే పలు ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి. దీంతో రణ్‌వీర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలన్నా టైం పడుతుంది. అందుకే రానా-బోయపాటి కాంబినేషన్ సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. (Rana Daggubati)

 

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రానా.. ఒక మంచి కమర్షియల్ బ్రేక్ కోసం చూస్తున్నాడు. బోయపాటితో సినిమా చేస్తే రానా మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే అవకాశముంది. ఇక బోయపాటికి కూడా రానాతో సినిమా చేయడం ఫ్రెష్ ఫీల్ ని తీసుకొస్తుంది. చూద్దాం మరి వీరి కాంబో త్వరలోనే పట్టాలెక్కుతుందేమో.

 

Also Read: ఎవరూ ఊహించని దర్శకుడితో అకీరా నందన్ డెబ్యూ మూవీ!

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.