భారతీయ చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్(shah rukh khan)కి ఉన్న చరిష్మా అందరకి తెలిసిందే.మూడున్నర దశాబ్దాల నుంచి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ అశేష అభిమానులని అలరిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఆయన తనయుడు ఆర్యన్ ఖాన్(aryan khan)సినిమా రంగంలోకి అడుగుపెట్టనున్నాడు.ఈ విషయాన్నీ షారుక్ అధికారంగా వెల్లడి చెయ్యడం కూడా జరిగింది. కాకపోతే హీరోగా కాకుండా రైటర్ దర్శకుడిగా ఆర్యన్ తన సత్తా చాటబోతున్నాడు.
ఇప్పుడు ఈ విషయంపై ప్రముఖ హీరోయిన్ బిజెపి ఎంపి కంగనారనౌత్(kangana ranaut)మాట్లాడుతు చాలా మంది స్టార్ కుటుంబానికి చెందిన పిల్లలు సులభమైన మార్గాన్ని ఎంచుకోవడానికి నటనా రంగంలో కి వస్తారు.మేకప్ వేసుకోవడం,బరువు తగ్గడం, తమని తాము గాజుబొమ్మల్లా భావించి నటినటులుగా మారుతుంటారు.కానీ ఆర్యన్ హీరో అవుదామని కాకుండా దానిని మించి మెగా ఫోన్ పట్టుకోవడం ప్రశంసించాల్సిన విషయం.సినిమా కుటుంబానికి చెందిన పిల్లలు కెమెరా వెనుక నిలబడటానికి మనకి మరింత మంది కావాలి.
ఆర్యన్ ఫస్ట్ ప్రాజెక్ట్స్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇక ఈ సిరీస్ ని షారుక్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా వచ్చే ఏడాది నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది.చిత్ర పరిశ్రమ నేపధ్యంగా ఈ సిరీస్ తెరక్కనుందనే వార్తలు వస్తున్న ఈ నేపథ్యంలో ఆర్యన్ తన సినిమాలో ఏం చెప్పబోతున్నాడనే ఆసక్తి సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఏర్పడింది.