![]() |
![]() |
గతేడాది 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచనాలు సృష్టించిందో తెలిసిందే. పెద్దగా అంచల్లేకుండా విడుదలైన ఈ చిత్రం మౌత్ టాక్ తో కలెక్షన్స్ పెంచుకుంటూ.. ఫుల్ రన్ లో రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఈ ఏడాది కూడా 'ది కేరళ స్టోరీ' అనే చిత్రం బాక్సాఫీస్ దగ్గర అలాంటి సంచలనాలే సృష్టించేలా ఉంది.
అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. కేరళకు చెందిన కొందరు మహిళలు ఇస్లాం మతంలోకి మారి, తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ లో చేరడమనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. సుదిప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని, విడుదలకు ముందు పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఆ అడ్డంకులను దాటుకొని ఈ మూవీ మే 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే 'ది కేరళ స్టోరీ' ఓపెనింగ్స్.. 'ది కాశ్మీర్ ఫైల్స్' ని మించి ఉండటం విశేషం.
ఇండియాలో 'ది కాశ్మీర్ ఫైల్స్' మొదటి రోజు రూ.3.55 కోట్ల నెట్, రెండో రోజు రూ.8.50 కోట్ల నెట్ రాబట్టగా.. 'ది కేరళ స్టోరీ' మొదటి రోజు రూ.8.03 కోట్ల నెట్, రెండో రోజు రూ.11.22 కోట్ల నెట్ తో సత్తా చాటింది. దీంతో రెండు రోజుల్లో 19.25 కోట్ల నెట్ రాబట్టింది. ఇక మూడో రోజు ఆదివారం కావడంలో 15 కోట్లకు పైగా నెట్ వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కొందరు బాలీవుడ్ స్టార్ల సినిమాలు సైతం ఈ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టలేకపోయాయి. ఈ లెక్కన 'ది కేరళ స్టోరీ' సినిమా ఫుల్ రన్ లో 'ది కాశ్మీర్ ఫైల్స్'ని మించిన సంచలనాలు సృష్టించినా ఆశ్చర్యంలేదు.
![]() |
![]() |