![]() |
![]() |
ఇప్పుడున్న సోషల్ మీడియా ట్రెండ్‌లో ఎవరేం చేసినా నెటిజన్లు ఇట్టే కనిపెట్టేస్తున్నారు. అందుకే ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. మామూలు జనాలే ఈ విషయం మీద ఇంత ఫోకస్‌గా ఉంటే, జాన్వీ కపూర్ మాత్రం అజాగ్రత్తగా ఉన్నారా అనిపిస్తోంది. రీసెంట్‌గా థై హై స్లిట్ సెక్సీ గ్రీన్ డ్రస్ వేసుకున్నారు జాన్వీ. ఎప్పుడూ ఫ్యాషన్‌కి అమితంగా విలువిచ్చే జాన్వీ కపూర్ ధరించిన ఈ వస్త్రాలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. స్టైలిష్‌గా ఉన్నారని కొందరన్నారు. గ్లామర్ డోస్ పెరిగిందని మరికొందరన్నారు. రియల్ లైఫ్‌లో ప్రేమలో పడితే, ఇలాంటి రంగులన్నీ కళ్లముందు మెదలాల్సిందే అని మరికొందరు సరదాగా రాసుకొచ్చారు. కానీ ఇంకొందరు మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
జీక్యూ35 మోస్ట్ ఇన్‌ఫ్లుయన్షల్ యంగ్ ఇండియన్స్ అవార్డు వేడుకకు హాజరయ్యారు జాన్వీ కపూర్. హై స్లిట్ గ్రీన్ డ్రస్సుకి తోడు మైనర్ కట్స్ కూడా బాగానే కనిపించాయి జాన్వీ డ్రస్సులో. కాస్త డార్క్ ఐ షాడో, న్యూడ్ షేడ్ లిప్‌స్టిక్, గ్లసా కాంబినేషన్... ఇవన్నీ అచ్చం ఉర్ఫిని గుర్తు చేస్తున్నాయని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మరో వైపు జాన్వీ సౌత్ ఎంట్రీ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. నార్త్ లో ఒక సినిమాకు తీసుకునే అమౌంట్‌తో పోలిస్తే, సౌత్ మూవీస్ కి డబుల్ రేట్ అడుగుతున్నారట ఈ బ్యూటీ. తారక్ పక్కన హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ. ఫస్ట్ వెంచర్‌ని బట్టే, మీరు నా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. రాజమౌళి, మహేష్ మూవీలోనూ నాయికగా జాన్వీ పేరు వినిపిస్తోంది. అయితే ఆమెను అప్రోచ్ కాలేదని అన్నారు మేకర్స్. ఇప్పటికి కాలేదా? కాదలచుకోలేదా? మరెవరైనా మనసులో ఉన్నారా? అంటూ మేకర్స్ ని స్వీట్‌గా అడుగుతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.
![]() |
![]() |