![]() |
![]() |
దాదాపు దశాబ్ద కాలం తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పూర్వ వైభవం సంతరించుకుంటున్నారు. ఆయన నటించిన పఠాన్ చిత్రం అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఈ చిత్రంలో దీపికా పడుకొనే హీరోయిన్గా నటించగా, జాన్ అబ్రహం విలన్ పాత్రను పోషించారు. ఐదు రోజుల్లో ఏకంగా 500 కోట్ల గ్రాసును ఈ చిత్రం వసూలు చేసింది. 300 కోట్లు షేర్ వచ్చిందని సమాచారం. దీంతో సినిమాకు పెట్టిన బడ్జెట్ ఖర్చులన్నీ వచ్చేసినట్టే.
ఇకపై వచ్చేదంతా లాభమే. ఈ సినిమా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా చివరకు విదేశాల్లో కూడా తన విజయ బావుటా ఎగురవేస్తుంది. కథగా పెద్దగా ఏమీ లేకపోయినా ఈ చిత్రంలో షారుక్ ను చూపించిన విధానం.... ఆయనపై తీసిన ఎలివేషన్స్ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఈ క్రెడిట్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కు దక్కుతుంది. తాజాగా ఈ చిత్రం సక్సెస్ వేడుక జరిగింది. ఇందులో దీపికా పడుకొనే హై హీల్స్ వేసుకొని కనిపించింది. అసలే పొడుకాళ్ళ సుందరి అయినా దీపిక పడుకొనే షారుక్ పక్క నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది.
స్టేజి మీద అందరి ముందు ఆమె కిందకి వంగి షారుక్ ఖాన్ చెక్కిళ్ల మీద ముద్దు పెట్టడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పఠాన్ సినిమాలో షారుక్ -దీపిక మీద చిత్రీకరించిన బేషరమ్ సాంగ్ ఎంత వివాదం అయిందో అందరికీ తెలిసిందే. దాంతో దీపిక- షారుక్ ను ముద్దాడే వీడియోను కొందరు పాజిటివ్‌గా వైరల్ చేస్తుంటే మరికొందరు నెగిటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎందరు ట్రోల్ చేసినా ఈ చిత్రానికి ఉచిత పబ్లిసిటీ మాత్రం అనుకోకుండా లభిస్తూనే ఉంది. కొన్ని వర్గాలు ఈ చిత్రంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, నెగటివ్ పబ్లిసిటీ జరుగుతున్నా కూడా వాటితో సంబంధం లేకుండా ఈ చిత్రానికి వస్తున్న కలెక్షన్స్ ను చూసి ట్రేడ్ పండితులే ఆశ్చర్యపోతున్నారు.
దాదాపు దశాబ్దకాలం తర్వాత మరలా షారుక్ ఈ స్థాయిలో విజృంభించడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. కొందరు పఠాన్ టైటిల్ ను మార్చి ఇండియన్ పఠాన్ గా టైటిల్ పెట్టాలని వాదిస్తున్నారు. వీటన్నింటితో సంబందం లేకుండా ఇంకా చెప్పాలంటే ఆ వివాదాల కారణంగానే ఈ చిత్రం అందరిలో అసలు సినిమాలో ఏముందో చూడాలనే ఆసక్తిని కలిగిస్తుండటం విశేషమనే చెప్పాలి.
![]() |
![]() |