భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటుల్లో ఒకడైన అమీర్ ఖాన్(aamir khan)1973 లో ధర్మేంద్ర హీరోగా వచ్చిన యాదోన్ కి బారత్ అనే చిత్రం ద్వారా బాలనటుడిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.ఆ తర్వాత 1988 లో'ఖయామత్ సే ఖయామత్' తో సోలో హీరోగా మారి మూడున్నర దశాబ్దాలుగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తూ నాలుగు జాతీయ, ఏడు ఫిలింఫేర్ పురస్కారాలుని కూడా అందుకున్నాడు.
రీసెంట్ గా అమీర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నా కూతురు ఐరా(ira khan)తో కొంత కాలం నుంచి నాకు మాటలు లేవు. అలాంటి సమయంలో ఐరా సూచనతో ఇద్దరం కలిసి థెరపిస్ట్ ని సంప్రదించాం.దీంతో ఎన్నో ఏళ్లుగా మా ఇద్దరి మధ్య ఉన్న సమస్యలు తొలిగిపోయి మంచి బంధం ఏర్పడింది.ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను.
నా విషయానికి వస్తే నేను చాలా తెలివిగల వాడ్ని.దాంతో ఏదైనా సమస్య వస్తే పరిష్కరించ గలనని అనుకుంటా.నేను మాత్రమే కాదు చాలా మంది అలాగే అనుకుంటారు.మనకి ఎంత జ్ఞానం ఉన్నా, కొన్ని విషయాలు మాత్రమే అర్ధం చేసుకోగలం.కానీ అన్నింటిని అర్ధం చేసుకోగలిగే ఒక థెరఫీ ని కలిస్తే మంచి ఉపశమనాన్ని పొందుతారు. థెరపీ ని కలిసే విషయంలో ఎవరు కూడా వెనుకంజ వెయ్యద్దు. ఎవరైనా థెరపిస్ట్ ని కలిసిరాని తెలిస్తే వారి మానసిక ఆరోగ్యం బాలేదని తెలిసిపోతుందని అందరు ఆలోచిస్తారు.తమని వేరేలా చూస్తారనే భయాల వల్ల చాలా మంది ఆసక్తి చూపరు. అలాంటి భయమాలేమి పెట్టుకోకుండా థెరఫీ ని కలవండని చెప్పుకొచ్చాడు.