Home  »  Bollywood News  »  Cocktail 2 Trailer: 'కాక్‌టైల్ 2' ట్రైలర్ రివ్యూ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో రష్మిక రచ్చ!

Updated : Jun 2, 2026

బాలీవుడ్‌లో ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కాక్‌టైల్' సీక్వెల్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మ్యాడక్ ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కిన 'కాక్‌టైల్ 2' అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. (Cocktail 2 Trailer)

ఈ ట్రైలర్ చూస్తుంటే ఆధునిక కాలపు రిలేషన్‌షిప్స్, ఫ్రెండ్‌షిప్ మరియు లవ్ చుట్టూ తిరిగే పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉండబోతుందని స్పష్టమవుతోంది. కొత్త రిలేషన్స్ ఇచ్చే ఎగ్జైట్‌మెంట్, పాత స్నేహితుల మధ్య ఉండే బాండింగ్, ఆపై స్నేహంలో కలిసే ప్రేమ రంగుల నేపథ్యంలో కథను చాలా కలర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. సరికొత్త కాన్సెప్ట్‌తో సాగే డైలాగులు యువతను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. 

ట్రైలర్‌లో షాహిద్ కపూర్ తన మార్క్ రొమాంటిక్ అండ్ చార్మింగ్ లుక్స్‌తో అలరించగా, కృతి సనన్ గ్లామరస్ రోల్‌లో మెరిసిపోయింది. ఇక రష్మిక మందన్న తనదైన బోల్డ్ అండ్ బబ్లీ క్యారెక్టర్‌తో బాలీవుడ్‌లో గట్టి ఇంపాక్ట్ చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర రష్మిక లుక్ సర్ ప్రైజ్ చేసింది.  వీరి ముగ్గురి మధ్య కెమిస్ట్రీ మరియు వచ్చే కొన్ని కామెడీ సీన్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.

ప్రేమకు కూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందనే ఆలోచనలు ఉన్న నేటితరం యువత లైఫ్ స్టైల్‌ను, అలాగే ఒకరినొకరు విడిచి ఉండలేని ముగ్గురు స్నేహితుల ఎమోషనల్ జర్నీని ఇందులో చూపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే పాత 'కాక్‌టైల్' సినిమా సూపర్ హిట్ సాంగ్ "తుమ్హీ హో బంధు సఖీ తుమ్హీ" రీమిక్స్ వెర్షన్ పాత జ్ఞాపకాలను రీఫ్రెష్ చేస్తూ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మొత్తానికి వినోదం, గ్లామర్ మరియు బలమైన ఎమోషన్స్ కలగలిపిన పక్కా కమర్షియల్ ప్యాకేజీలా ఈ ట్రైలర్ కనిపిస్తోంది. ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే లక్షల వ్యూస్‌తో దూసుకుపోతూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో మ్యాజిక్ చేయబోతుందో చూడాలి.

ఈ భారీ రొమాంటిక్ డ్రామా జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. షాహిద్, రష్మిక, కృతిల ట్రయాంగిల్ లవ్ స్టోరీ వెండితెరపై ఎలాంటి హంగామా సృష్టిస్తుందో అని ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యూత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.